☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం అనేది కేవలం పూజలకు, భక్తికే పరిమితం అనుకుంటే పొరపాటే! వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఇంట్లో ఉంటే ఆ వాతావరణంలో ప్రతికూల శక్తి తగ్గి, పాజిటివ్ ఎనర్జీ నిండుతుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. సరియైన దిశలో, సరైన పద్ధతిలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో ప్రశాంతత, సంతోషంతో పాటు సిరిసంపదలు కూడా వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ పవిత్రమైన మొక్క ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి వాస్తులో కొన్ని విశేషమైన చిట్కాలు చెప్పారు.
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి

Tulsi Plant Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం అనేది కేవలం పూజలకు, భక్తికే పరిమితం అనుకుంటే పొరపాటే! వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఇంట్లో ఉంటే ఆ వాతావరణంలో ప్రతికూల శక్తి తగ్గి, పాజిటివ్ ఎనర్జీ నిండుతుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. సరియైన దిశలో, సరైన పద్ధతిలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో ప్రశాంతత, సంతోషంతో పాటు సిరిసంపదలు కూడా వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ పవిత్రమైన మొక్క ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి వాస్తులో కొన్ని విశేషమైన చిట్కాలు చెప్పారు.

ముందుగా తులసి మొక్కను ఇంట్లో ఏ వైపు పెట్టాలనేది చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఈశాన్యం (ఉత్తర-తూర్పు) మూలన గానీ, లేదా తూర్పు దిశలో గానీ తులసి చెట్టును నాటడం అత్యంత శుభకరం. ఎందుకంటే ఈ దిశల నుంచి సానుకూల శక్తి ఎక్కువగా ప్రసరిస్తుంది. అలాగే మొక్కను ఎప్పుడూ గాలి, వెలుతురు సరిగ్గా తగిలేలా పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. ఇక, ధనానికి, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఒక సులువైన చిట్కా కూడా ఉంది. తులసి చెట్టుకు సంబంధించిన ఎండిపోయిన కొన్ని ఆకులను తీసుకొని, ఒక ఎర్రటి గుడ్డలో జాగ్రత్తగా మూటకట్టాలి. ఆ మూటను మనం ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువాలో గానీ, లేదా ముఖ్యమైన కాగితాలు ఉంచే ప్రదేశంలో గానీ పెడితే ఆర్థికంగా కలసివస్తుందని చెప్తారు.

ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తులసి కోట ముందు దీపం వెలిగించడం మన సాంప్రదాయంలో చాలా కాలంగా వస్తున్న ఆచారం. అలా క్రమం తప్పకుండా పూజ చేసి దీపం పెట్టడం వల్ల ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఉదయాన్నే తులసి చెట్టుకు నీళ్ళు సమర్పించేటప్పుడు ‘ఓం శ్రీం’ అనే మంత్రాన్ని జపించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్రం శ్రీమహావిష్ణువుకు ప్రియమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అయితే ఇవన్నీ మన నమ్మకం, భక్తి మీద ఆధారపడి పనిచేస్తాయి. తులసిని ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్క ఉండే పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎండిపోయిన లేదా వాడిపోయిన తులసి మొక్క ఉండటం మంచిది కాదని వాస్తు చెప్తోంది. ఒకవేళ మొక్క పూర్తిగా ఎండిపోతే, దాన్ని గౌరవప్రదంగా తొలగించి, ఆ స్థానంలో మరో కొత్త పచ్చని తులసి మొక్కను నాటుకోవాలి. ఇక, హిందూ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే ఈ మొక్కను పూజించడం వల్ల దైవానుగ్రహం దక్కడమే కాకుండా, ఇంట్లోకి లక్ష్మీదేవి నడచి వస్తుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ విశ్వసిస్తారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com