☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!

ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పర్స్‌తో పనిలేదు.. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. సింపుల్‌గా UPI ద్వారా పేమెంట్‌ చేస్తున్నారు.. అయితే, రూ.2,000 దాటిన UPI మర్చంట్ చెల్లింపులపై ఈ నెల 15వ తేదీ నుంచి 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. రూ.2,000 వరకు UPI చెల్లింపులపై రుసుము ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే MDR ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపకూడదని పేర్కొంది. అయితే, వ్యాపారులు ఈ ఖర్చును వినియోగదారుల నుంచి […]
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!

ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పర్స్‌తో పనిలేదు.. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. సింపుల్‌గా UPI ద్వారా పేమెంట్‌ చేస్తున్నారు.. అయితే, రూ.2,000 దాటిన UPI మర్చంట్ చెల్లింపులపై ఈ నెల 15వ తేదీ నుంచి 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. రూ.2,000 వరకు UPI చెల్లింపులపై రుసుము ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే MDR ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపకూడదని పేర్కొంది. అయితే, వ్యాపారులు ఈ ఖర్చును వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై Local Circles నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి..

291 జిల్లాల నుంచి UPI వినియోగదారుల నుంచి 67 వేలకు పైగా స్పందనలు వచ్చినట్లు ఇండియా టుడే పేర్కొంది.. అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తే కేవలం 14 శాతం మంది మాత్రమే UPIనే కొనసాగిస్తూ ఆ ఖర్చును భరిస్తామని చెప్పారు. మిగిలినవారు ఇతర చెల్లింపు విధానాలను ఎంచుకోవడం లేదా కొనుగోలును వాయిదా వేయడం చేస్తామని తెలిపారు. అంటే, వ్యాపారి UPI ఛార్జీని కస్టమర్‌పై వేస్తే 76 శాతం మంది మరో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది. నగదు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంక్ బదిలీ వంటి ప్రత్యామ్నాయాల వైపు మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

ఉదాహరణకు రూ.5,000 విలువైన వస్తువుకు UPI ద్వారా చెల్లిస్తే 0.4 శాతం MDR ప్రకారం రూ.20 అవుతుంది. అయితే ఈ MDRను వినియోగదారుడి నుంచి ప్రత్యేకంగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో వ్యాపారులపై నిర్వహించిన మరో Local Circles సర్వేలో కూడా MDRపై పరిమిత అంగీకారం కనిపించింది. రూ.2,000కు పైబడిన UPI చెల్లింపులపై 0.4 శాతం MDRను తాము భరిస్తామని కేవలం 17 శాతం మంది వ్యాపారులు చెప్పారు. 41 శాతం మంది ఎలాంటి MDRనూ భరించబోమని తెలిపారు. ఈ సర్వేకు 242 జిల్లాల నుంచి 32 వేలకు పైగా స్పందనలు వచ్చాయి.

UPI వినియోగం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉంది. NPCI గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో UPI ద్వారా 24,508.96 మిలియన్ (24.51 బిలియన్) లావాదేవీలు, మొత్తం రూ.29.82 లక్షల కోట్ల విలువతో జరిగాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న MDR విధానం పెద్ద మొత్తాల UPI చెల్లింపులపై వినియోగదారులు, వ్యాపారుల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారింది. ప్రభుత్వం మాత్రం MDRను వినియోగదారులపై అదనపు ఛార్జీగా మోపకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండిNora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com