☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asia Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ గోల్డ్!

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఏడో రోజు భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. కబడ్డీ క్రీడలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతూ మన జట్లు రెండు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోరులో భారత్ 40-34 తేడాతో బలమైన ఇరాన్‌ను మట్టికరిపించింది. మహిళల ఫైనల్‌లోనూ భారత అమ్మాయిలు ఉత్కంఠభరితంగా పోరాడి 37-34తో ఇరాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల కబడ్డీ జట్టుకు ఇది తొమ్మిదో పసిడి పతకం కావడం విశేషం. […] The post Asia Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ గోల్డ్! appeared first on Adya News Telugu.
Asia Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ గోల్డ్!

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఏడో రోజు భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. కబడ్డీ క్రీడలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతూ మన జట్లు రెండు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోరులో భారత్ 40-34 తేడాతో బలమైన ఇరాన్‌ను మట్టికరిపించింది. మహిళల ఫైనల్‌లోనూ భారత అమ్మాయిలు ఉత్కంఠభరితంగా పోరాడి 37-34తో ఇరాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించారు.

ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల కబడ్డీ జట్టుకు ఇది తొమ్మిదో పసిడి పతకం కావడం విశేషం. మహిళల జట్టు ఇప్పటివరకు నిర్వహించిన ఐదు క్రీడల్లో నాలుగోసారి స్వర్ణం నెగ్గి సత్తా చాటింది. అర్జున్ దేశ్‌వాల్, దేవాంక్, కెప్టెన్ పుష్ప, సంజు దేవి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఆద్యంతం ఆధిక్యాన్ని కాపాడుకుంటూ పసిడిని ముద్దాడారు.

మారథాన్‌లో భారత సైనిక ఉద్యోగి సావన్ బర్వాల్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేశాడు. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు మారథాన్‌లో పతకం అందించడమే కాకుండా జాతీయ రికార్డును తిరగరాశాడు. షాట్‌పుట్‌లో స్టార్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ వరుసగా మూడో పతకంగా రజతాన్ని గెలుచుకున్నాడు.

మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచి చౌదరి 53.21 సెకన్లలో కాంస్య పతకం గెలుచుకుంది. షూటింగ్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ జట్టు రజతం కైవసం చేసుకుంది. తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషీ చౌక్సీల బృందం ఈ ఘనత సాధించింది. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప జంట కాంస్యం సాధించింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. టేబుల్ టెన్నిస్‌లో భారత పోరు ముగిసింది.

The post Asia Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ గోల్డ్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఓనం జాక్‌పాట్‌.. రూ.30 కోట్ల లాట‌రీ!బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com