☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి..

ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన కల్యాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులు షఫీ, అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన కల్యాణి అలియాస్ దుర్గను అతి కిరాతకంగా చంపినట్లు విచారణలో తేలింది. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. గతంలో కల్యాణికి గౌస్ మొహిద్దీన్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. మొహిద్దీన్‌కు అప్పటికే వివాహం జరిగిందని తెలిసి ఇద్దరూ విడిపోయారు. బాబును విజయవాడలోని బంధువు షఫీకి పెంచుకోవడానికి ఇచ్చారు. […] The post బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి.. appeared first on Adya News Telugu.
బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి..

ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన కల్యాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితులు షఫీ, అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన కల్యాణి అలియాస్ దుర్గను అతి కిరాతకంగా చంపినట్లు విచారణలో తేలింది. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

గతంలో కల్యాణికి గౌస్ మొహిద్దీన్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు జన్మించాడు. మొహిద్దీన్‌కు అప్పటికే వివాహం జరిగిందని తెలిసి ఇద్దరూ విడిపోయారు. బాబును విజయవాడలోని బంధువు షఫీకి పెంచుకోవడానికి ఇచ్చారు. హోటల్‌లో పనిచేసే కల్యాణికి వచ్చే జీతం సరిపోలేదు. ఆమె విలాసాలకు అలవాటుపడింది. డబ్బుల కోసం తరచూ షఫీని బ్లాక్‌మెయిల్ చేసేది. ఇవ్వకపోతే బాబును తీసుకెళ్తానని, తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. షఫీ ఆమెకు నగదుతో పాటు బంగారం కూడా కొనిచ్చాడు.

ఈ నెల 17న కల్యాణి విజయవాడలోని షఫీ ఇంటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో ఆమె రూ. 20 వేలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే రేప్ కేసు పెడతానని హెచ్చరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన షఫీ మటన్ కత్తితో ఆమెను నరికి చంపాడు.

అనంతరం తన దుకాణంలో పనిచేసే అబ్దుల్లాను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. శవాన్ని పది ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను పాలిథీన్ కవర్లలో మూటగట్టారు. గొల్లపూడి వద్ద వీటీపీఎస్ (VTPS) కూలింగ్ కాలువలో పారవేశారు.

కాలువలో లభించిన శరీర భాగాలపై ఉన్న టాటూ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీడీఆర్ (CDR) కాల్ డేటాను పరిశీలించారు. కల్యాణి, షఫీ చివరి లొకేషన్ ఒకే చోట భవానీపురంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులకు సహకరించిన ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

The post బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి.. appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asia Games: కబడ్డీలో భారత్‌కు డబుల్ గోల్డ్!బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com