☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి!

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సెప్టెంబరు 28 నుంచి బ్యాంకులు వరుసగా మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రత్యక్ష సేవలు నిలిచిపోతుండడంతో ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడతారు. దీనితో యూపీఐ, మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఒక్కసారిగా పెరుగుతాయి. ప్రజలు అత్యవసర నగదు కోసం ఏటీఎం కేంద్రాలను కూడా భారీగా ఆశ్రయిస్తారు. ఆన్‌లైన్ వాడకం పెరిగే ఈ సమయాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తారు. బ్యాంకు ప్రతినిధుల పేరుతో ప్రజలకు నకిలీ […] The post బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి! appeared first on Adya News Telugu.
బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి!

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా సెప్టెంబరు 28 నుంచి బ్యాంకులు వరుసగా మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రత్యక్ష సేవలు నిలిచిపోతుండడంతో ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడతారు. దీనితో యూపీఐ, మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఒక్కసారిగా పెరుగుతాయి. ప్రజలు అత్యవసర నగదు కోసం ఏటీఎం కేంద్రాలను కూడా భారీగా ఆశ్రయిస్తారు.

ఆన్‌లైన్ వాడకం పెరిగే ఈ సమయాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తారు. బ్యాంకు ప్రతినిధుల పేరుతో ప్రజలకు నకిలీ సందేశాలు, కాల్స్ పంపిస్తారు. “మీ ఖాతా స్తంభించింది” లేదా “వెంటనే వివరాలు ఇవ్వకపోతే కార్డు రద్దవుతుంది” అని కంగారు పెడతారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని ఏటీఎం పిన్, సీవీవీ, ఓటీపీ వివరాలను తస్కరిస్తారు.

సర్వర్లు మొరాయిస్తున్నాయని నమ్మించి తప్పుడు ఏపీకే (APK) ఫైల్స్ లింకులను సైతం పంపిస్తుంటారు. వాటిని ఫోన్లలో డౌన్‌లోడ్ చేయించి ఖాతాల్లోని మొత్తం నగదును ఖాళీ చేసే ప్రమాదం ఉంది. సమస్యల పరిష్కారం కోసం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో కనిపించే బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ సంప్రదించవద్దు. నేరగాళ్లు మోసపూరిత నంబర్లను ఉంచి ప్రజలను సులభంగా బోల్తా కొట్టిస్తారు.

సందేహాలు ఉంటే బ్యాంకు పాస్‌బుక్‌లు లేదా మీ కార్డుల వెనుక ముద్రించిన నంబర్లకు మాత్రమే కాల్ చేయాలి. నగదు అవసరం ఉన్నప్పటికీ ధ్రువీకరణ లేని తప్పుడు లోన్ యాప్‌ల ఉచ్చులో అస్సలు పడవద్దు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు డయల్ చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

The post బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బెదిరింపులకు పాల్పడుతోందని.. ముక్కలు చేసి..ఇదే నా చివరి ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com