☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇదే నా చివరి ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తన చివరి మెగా టోర్నీ అని స్పష్టం చేశాడు. దేశం తరఫున ఆడే ఆఖరి ప్రపంచకప్ ఇదేనని తెలిపాడు. ఆ ట్రోఫీని కైవసం చేసుకోవడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు. ఇందుకోసం మైదానంలో తన సర్వశక్తులూ ధారపోస్తానని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడాడు. ‘జియోస్టార్‌’తో తన మనసులోని మాటలను […] The post ఇదే నా చివరి ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ appeared first on Adya News Telugu.
ఇదే నా చివరి ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తన చివరి మెగా టోర్నీ అని స్పష్టం చేశాడు. దేశం తరఫున ఆడే ఆఖరి ప్రపంచకప్ ఇదేనని తెలిపాడు. ఆ ట్రోఫీని కైవసం చేసుకోవడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు. ఇందుకోసం మైదానంలో తన సర్వశక్తులూ ధారపోస్తానని వెల్లడించాడు.

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడాడు. ‘జియోస్టార్‌’తో తన మనసులోని మాటలను పంచుకున్నాడు. వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా 2027 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచకప్‌ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.

వన్డే ప్రపంచకప్‌లో తీవ్రత మరే ఇతర టోర్నమెంట్‌లోనూ ఉండదని కోహ్లీ వివరించాడు. ఇందులో దాదాపు 10 మ్యాచ్‌లను టీ20 స్థాయి ఇంటెన్సిటీతో ఆడాల్సి ఉంటుందన్నాడు. ఒక్కో వన్డే మ్యాచ్ రెండున్నర టీ20లతో సమానమని చెప్పాడు. మెగా ఈవెంట్‌లో వరుసగా పది మ్యాచ్‌ల పాటు ఆ తీవ్రతను కొనసాగించడం చాలా పెద్ద సవాలు అని పేర్కొన్నాడు.

మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఆలోచనలను పంచుకున్నాడు. తాను చేయాల్సిన పని పూర్తయిందనే భావన ఎప్పుడూ కలగలేదన్నాడు. ఆడుతున్నంత కాలం సరికొత్త లక్ష్యం కోసం ఆటగాళ్లు ఎదురుచూస్తూనే ఉంటారని చెప్పాడు. తాను కూడా ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

ఐసీసీ టోర్నీలలో వేర్వేరు ప్రత్యర్థులను వేర్వేరు వేదికలపై ఎదుర్కోవాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని పేర్కొన్నాడు. కొత్తగా ఆలోచించి విభిన్నంగా సిద్ధం కావడమే అసలైన సవాలు అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి తాజా ప్రకటనలతో రాబోయే వన్డే ప్రపంచకప్‌ వరకు ఈ సీనియర్ ద్వయం కొనసాగుతుందా లేదా అనే సందేహాలకు పూర్తిగా తెరపడింది.

The post ఇదే నా చివరి ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బ్యాంకులకు వరుస సెలవులు.. అప్రమత్తంగా ఉండండి!‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్ బీస్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com