☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games 2026 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. అద‌ర‌గొట్టిన ఆర్చ‌రీ జ‌ట్టు.. తెలుగు అమ్మాయిల‌కు గోల్డ్..

ఆసియా క్రీడ‌ల్లో (Asian Games 2026) భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం వ‌చ్చి చేరింది.
Asian Games 2026 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం.. అద‌ర‌గొట్టిన ఆర్చ‌రీ జ‌ట్టు.. తెలుగు అమ్మాయిల‌కు గోల్డ్..

Asian Games 2026 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం వ‌చ్చి చేరింది. మ‌హిళ‌ల కాంపౌండ్ ఆర్చ‌రీ జట్టు స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్‌లో చైనాను ఓడించి మ‌రీ గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడ‌లు 2026లో భార‌త్‌కు ఇది ఏడో స్వ‌ర్ణం.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఖాతాలో 54 ప‌త‌కాలు ఉన్నాయి. ఇందులో ఏడు స్వ‌ర్ణాలు, 21 ర‌జ‌తాలు, 26 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ 9వ స్థానంలో కొన‌సాగుతోంది.

బుధ‌వారం జ్యోతి సురేఖ వెన్నం, ప్ర‌తీకా ప్రదీప్, చికిత తానిప‌ర్తి ల‌తో కూడిన మ‌హిళ‌ల కాంపౌండ్ ఆర్చ‌రీ జట్టు ఫైన‌ల్‌లో చైనాను 238-234 స్కోరుతో ఓడించి గోల్డ్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో భార‌త మ‌హిళ‌ల కాంపౌండ్ ఆర్చ‌రీ జట్టు (238) దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశారు. 2014లో ఇంచియాన్ ఆసియా క్రీడల సందర్భంగా కొరియా ఈ రికార్డును సాధించింది.

ఇక భార‌త జ‌ట్టులోని జ్యోతి సురేఖ, చికిత తానిప‌ర్తి తెలుగు అమ్మాయిలు కావ‌డం విశేషం. జ్యోతి సురేఖ విజ‌య‌వాడ‌కు చెందిన అమ్మాయి కాగా.. చికిత ది పెద్ద‌ప‌ల్లి. ఇక ప్ర‌తీకా ప్ర‌దీప్ విష‌యానికి వ‌స్తే ఆమెది మ‌హారాష్ట్ర‌.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rahasya Gorak : ఐస్ కేవ్‌లో ర‌హ‌స్య గోర‌ఖ్.. ఇది అద్భుతం.. ఫోటోలు వైర‌ల్‌..Gold Price Drop: భారీగా పతనమైన పసిడి ధరలు.. ఒక్కరోజే రూ.1,480 వరకు.. కొనుగోలుదారులకు గోల్డెన్ ఛాన్స్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com