☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

వినాయక శోభయాత్రలో యువకుడి గొంతు కోసే యత్నం

న‌ల్ల‌గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చేందుకు...
వినాయక శోభయాత్రలో యువకుడి గొంతు కోసే యత్నం

మాడుగులపల్లి, సెప్టెంబ‌ర్ 23 : న‌ల్ల‌గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయక శోభయాత్ర ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసి, గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుక్కడం గ్రామంలో వినాయక నిమజ్జన శోభయాత్ర వైభవంగా సాగుతోంది. ఊరేగింపు గ్రామంలోని బస్టాండ్ సమీపానికి చేరుకోగానే, పోతపాక సాయి అనే యువకుడిపై కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్ర ఆవేశంతో సాయి గొంతు కోసేందుకు యత్నించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే రక్తపుమడుగులో ఉన్న సాయిని చికిత్స కోసం నల్ల‌గొండ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్ప‌త్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా? లేక శోభయాత్రలో తలెత్తిన గొడవల వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← George Krish | ‘జార్జ్‌ క్రిష్‌’ హీరోయిన్‌ను ఫైనల్‌ చేసిన శ్రీనువైట్ల..!Swami Ramdev | ప‌తంజ‌లి నెయ్యిలో క‌ల్తీ లేదు.. మందుల‌పై నిషేధం అబద్ధం.. స్వామి రామ్‌దేవ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com