☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి

బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని వైరా నియోజకవర్గ తొలి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి

కారేపల్లి, అక్టోబర్ 1: బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని వైరా నియోజకవర్గ తొలి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి అన్నారు. గురువారం ఖ‌మ్మం జిల్లా కారేప‌ల్లి మండల పరిధిలోని రామలింగాపురం (కారేపల్లి క్రాస్‌రోడ్డు)లో ఆమె నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గ ప్రజలతో ఏర్పడిన అనుబంధం తనకు ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ..

ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశానని చంద్రావతి తెలిపారు. ప్రస్తుతం కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నానన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సాధ్యమైన మేరకు పరిష్కారానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రజలతో తనకున్న అనుబంధమే తనకు బలమని పేర్కొన్నారు.

కార్యకర్తలకు అండగా..

పార్టీ అధిష్టానం అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.

సమన్వయంతో ముందుకు..

నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమన్వయంతో ముందుకు సాగుతానని చంద్రావతి తెలిపారు. పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తూ అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వర్గ విభేదాలకు తావులేకుండా పరస్పర సమన్వయం, సహకారంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చంద్రావతి స్పష్టం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Revanth Reddy Sabha | రేవంత్‌ సభకు మనుషుల తరలింపు.. కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం చూడండిAP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com