☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!

Beerakaya Pachadi Recipe: మన తెలుగిళ్లలో పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. రోజూ తినే కూరలు బోరింగ్ అనిపించినప్పుడు లేదా నోటికి కారంగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు గుర్తొచ్చేది రోటి పచ్చడే. అలాంటి వాటిలో ఎంతో మందికి ఇష్టమైనది ‘బీరకాయ పచ్చడి’. సాధారణంగా పిల్లలు, ఇంట్లోని కొందరు బీరకాయ కూర అంటే ముఖం చాటేస్తుంటారు. కానీ ఈ పద్ధతిలో ఒక్కసారి పచ్చడి చేసి పెడితే వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని […]
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!

Beerakaya Pachadi Recipe: మన తెలుగిళ్లలో పచ్చళ్లకు ఉండే స్థానమే వేరు. రోజూ తినే కూరలు బోరింగ్ అనిపించినప్పుడు లేదా నోటికి కారంగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడు గుర్తొచ్చేది రోటి పచ్చడే. అలాంటి వాటిలో ఎంతో మందికి ఇష్టమైనది ‘బీరకాయ పచ్చడి’. సాధారణంగా పిల్లలు, ఇంట్లోని కొందరు బీరకాయ కూర అంటే ముఖం చాటేస్తుంటారు. కానీ ఈ పద్ధతిలో ఒక్కసారి పచ్చడి చేసి పెడితే వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా, లేదంటే ఉదయం వేళ టిఫిన్లలో కరకరలాడే దోశల్లోకి నంజుకున్నా ఈ పచ్చడి రుచి అదిరిపోతుంది.

చాలామంది ఇంట్లో పచ్చడి చేసేటప్పుడు బీరకాయ చేదుగా ఉండటం వల్లనో, లేదంటే సరిగ్గా మగ్గించక నీరు కారిపోవడమో జరుగుతుంది. సరైన చిట్కాలు, పక్కా కొలతలు పాటిస్తే వంటల్లో కొత్తగా అడుగుపెట్టిన వారు కూడా చాలా సులువుగా, అద్భుతమైన రుచితో ఈ పచ్చడిని తయారు చేయవచ్చు. ఆ తయారీ విధానం, కావలసిన పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు:

* లేత బీరకాయ: 1 (మధ్యస్థ పరిమాణం)
* పచ్చిమిర్చి: 8 నుంచి 10
* ఎండుమిర్చి: 4 (వేపుడు కోసం) + 2 (తాలింపు కోసం)
* శనగపప్పు: 1 స్పూన్ (వేపుడు కోసం) + 1 స్పూన్ (తాలింపు కోసం)
* మినప పప్పు: 1 స్పూన్ (వేపుడు కోసం) + 1 స్పూన్ (తాలింపు కోసం)
* చింతపండు: కొద్దిగా (చిన్న నిమ్మకాయ సైజు)
* వెల్లుల్లి రెబ్బలు: 4 నుంచి 5 (మిక్సీ కోసం) + 5 నుంచి 6 (తాలింపు కోసం)
* జీలకర్ర: అర టీస్పూన్
* ఆవాలు: అర టీస్పూన్
* ఇంగువ: చిటికెడు
* మెంతిపొడి: చిటికెడు
* కరివేపాకు: ఒక రెమ్మ
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: తగినంత

తయారీ విధానం

బీరకాయ సిద్ధం చేసే పద్ధతి

మొదటగా తాజా, లేత బీరకాయను తీసుకుని పైన ఉన్న చెక్కును తేలికగా తీసివేయాలి. ముక్కలు కోసేముందు ఒక చిన్న ముక్కను కొరికి రుచి చూడటం మర్చిపోకూడదు. కొన్నిసార్లు బీరకాయలు చేదుగా ఉంటాయి. మనం తీసుకున్న వాటిలో ఒక్క చేదు ముక్క ఉన్నా మొత్తం పచ్చడి పాడవుతుంది. కాబట్టి చేదు లేదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

పప్పులు, మిర్చి వేయించుకోవడం

స్టవ్‌పై ఒక కడాయిని పెట్టుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చిని వేసి బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి చక్కటి రంగు మారేదాకా వేయించి, స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

బీరకాయ ముక్కలను మగ్గించడం

ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలతో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ముక్కలు అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుకుంటూ మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి. బీరకాయ నుంచి నీరంతా బయటకు వచ్చి, ఆ నీరు పూర్తిగా ఇగిరిపోయేంతవరకు దాదాపు 10 నిమిషాల పాటు మగ్గించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

పచ్చడి రుబ్బుకోవడం

ముందుగా వేయించుకున్న మిర్చి, పప్పుల మిశ్రమం చల్లారిన తర్వాత.. అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చల్లారిన బీరకాయ ముక్కలను కూడా అదే జార్‌లోకి వేసి మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, రోటి పచ్చడి స్టైల్‌లో గ్రైండ్ చేసుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

ఘుమఘుమలాడే తాలింపు వేయడం

చిన్న తాలింపు గిన్నెలో నూనె వేడి చేసి అందులో రెండు ఎండుమిర్చి, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేయాలి. ఆపై కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. చివరగా చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతిపొడి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును పచ్చడిలో వేసి బాగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ‘బీరకాయ పచ్చడి’ సిద్ధమైనట్లే..

ముఖ్యమైన చిట్కాలు

* పచ్చడి ప్రారంభించే ముందే బీరకాయను కచ్చితంగా రుచి చూడాలి. చేదుగా ఉంటే ఆ కాయను వాడకూడదు.
* మిక్సీ పట్టేటప్పుడు అస్సలు నీళ్లు కలపకూడదు. బీరకాయలో ఉండే తేమతోనే పచ్చడి రుబ్బుకోవాలి. దీనివల్ల పచ్చడి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
* తాలింపు వేసేటప్పుడు చిటికెడు మెంతిపొడి, ఇంగువ వాడటం వల్ల పచ్చడికి అసలైన రోటి పచ్చడి ఘుమఘుమలు, అద్భుతమైన రుచి వస్తాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలుThe Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com