☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Bhagyashri Borse : మాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్ పరంపరకు బ్రేకులేసింది లెనిన్. మిస్టర్ బచ్చన్ నుండి ఆంధ్రా కింగ్ తాలూకా వరకు గ్లామర్ ట్రీట్ ఇచ్చినా.. ఫెర్ఫామెన్స్ రోల్స్ చేసినా సక్సెస్ పలకరించలేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోతున్న టైంలో లెనిన్ మూవీ ఆమెను సేవ్ చేసింది. భాగ్యశ్రీకే కాదు.. సరైన హిట్ లేక స్ట్రగుల్ పడుతోన్న అఖిల్ ఖాతాలోనూ ఓ బ్లాక్ బస్టర్ పడింది. ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడే భాగ్యశ్రీకి ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంది టాలీవుడ్. […]
Bhagyashri Borse : మాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్ పరంపరకు బ్రేకులేసింది లెనిన్. మిస్టర్ బచ్చన్ నుండి ఆంధ్రా కింగ్ తాలూకా వరకు గ్లామర్ ట్రీట్ ఇచ్చినా.. ఫెర్ఫామెన్స్ రోల్స్ చేసినా సక్సెస్ పలకరించలేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోతున్న టైంలో లెనిన్ మూవీ ఆమెను సేవ్ చేసింది. భాగ్యశ్రీకే కాదు.. సరైన హిట్ లేక స్ట్రగుల్ పడుతోన్న అఖిల్ ఖాతాలోనూ ఓ బ్లాక్ బస్టర్ పడింది.

ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడే భాగ్యశ్రీకి ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంది టాలీవుడ్. కానీ హిట్ కొట్టాక మేకర్స్ లైట్ తీసుకున్నట్లున్నారు. లెనిన్ తర్వాత మరో తెలుగు మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు భామ. భాగ్యశ్రీ కూడా ఇదే ఇండస్ట్రీలో గిరిగీసుకుని కూర్చోకుండా పొరుగు ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే కాంతలో తన ఫెర్ఫామెన్స్‌తో తమిళ తంబీలకు చేరువైన మహాలక్ష్మీ.. నెక్ట్స్ శివకార్తికేయన్ సరసన సేయాన్ చేస్తోంది. త్వరలో మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తొలి స్టెప్‌లోనే మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది భాగ్యశ్రీ బోర్సే. 2022లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన దేశ పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ విష్ణు మోహన్. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీకి ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అర్జున్ రాంపాల్, పార్తీ బన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆపరేషన్ గంగాతో భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఆడియన్స్ మది దోచేస్తుందో లేదో తెలియాలంటే నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com