☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో టెంప్టేషన్స్.. లెటర్ల కోసం ఇంటి సభ్యులకు షాకింగ్ టెన్షన్

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో టెంప్టేషన్ టాస్కులు ఇంటి సభ్యులను భావోద్వేగాలకు గురిచేస్తున్నాయి. కుటుంబ సభ్యులు ప్రేమగా రాసిన ఉత్తరాలు, ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలు కావాలంటే తోటి సభ్యులకు టెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితిని బిగ్ బాస్ కల్పిస్తున్నాడు. దీంతో కొందరు ఇంటి సభ్యులు తమకు కావాల్సిన వాటి కోసం ఇతరుల భావోద్వేగాలతో ఆట ఆడాల్సి వస్తోంది.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో టెంప్టేషన్స్.. లెటర్ల కోసం ఇంటి సభ్యులకు షాకింగ్ టెన్షన్

Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో టెంప్టేషన్ టాస్కులు ఇంటి సభ్యులను భావోద్వేగాలకు గురిచేస్తున్నాయి. కుటుంబ సభ్యులు ప్రేమగా రాసిన ఉత్తరాలు, ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలు కావాలంటే తోటి సభ్యులకు టెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితిని బిగ్ బాస్ కల్పిస్తున్నాడు. దీంతో కొందరు ఇంటి సభ్యులు తమకు కావాల్సిన వాటి కోసం ఇతరుల భావోద్వేగాలతో ఆట ఆడాల్సి వస్తోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో దేబ్జానీ, ముకేశ్, అమన్, రోహిత్, సృష్టి, త్రిగుణ్ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ముకేశ్ టెంప్టేషన్‌కు లొంగి దేబ్జానీ తల్లిదండ్రులు రాసిన ఉత్తరాన్ని నాశనం చేసిన విషయం తెలిసిందే. దీంతో దేబ్జానీ తీవ్రంగా భావోద్వేగానికి గురై వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చింది. అయితే కాసేపటి తర్వాత ఆమె బయటకు రాగానే నరేష్, రామ్ ప్రసాద్ ఆమెను నవ్వించే ప్రయత్నం చేశారు.

ఆ ఉత్తరంలో ఏముందో చెబుతామని చెప్పిన వారిద్దరూ.. దేబ్జానీ తెలుగులో మాట్లాడే తీరును అనుకరిస్తూ, ఆమె తల్లిదండ్రులు అదే తరహాలో ఉత్తరం రాసినట్లు సరదాగా చెప్పి ఆమెను నవ్వించారు. దీంతో కాసేపు ఇంట్లో వాతావరణం కూల్‌గా మారింది. మరోవైపు ముకేశ్‌కు బిగ్ బాస్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ముకేశ్ తండ్రితో కలిసి ఉన్న ఫొటోను అతడికి అందించాడు. ఆ ఫొటోను చూసిన ముకేశ్ ఎంతో సంతోషించాడు. అనంతరం బిగ్ బాస్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇదే సమయంలో రోహిత్, దేబ్జానీల మధ్య సరదాగా ‘పెళ్లిచూపులు’ సన్నివేశాన్ని నరేష్, రామ్ ప్రసాద్ క్రియేట్ చేసి ఇంట్లో నవ్వులు పూయించారు. వంట చేసే సమయంలో వంశీ, త్రిగుణ్‌లకు ఒకరోజంతా చేతికి ప్లాస్టర్ వేసుకుని ఉండాలని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కెప్టెన్ ఝాన్సీ మరోసారి ఇంటి సభ్యులకు గుర్తుచేసింది. అయితే ఈ విషయంలో త్రిగుణ్, ఝాన్సీ మధ్య వాదన జరిగింది.

ప్లాస్టర్ కోసం బిగ్ బాస్‌ను ఝాన్సీ కోరగా.. కొద్దిసేపటికి బిగ్ బాస్ ప్లాస్టర్ పంపించాడు. దీంతో వంశీ, త్రిగుణ్ ఇద్దరూ ప్లాస్టర్ వేసుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్ కోసం బిగ్ బాస్ మరోసారి టెంప్టేషన్ టాస్క్‌ను ప్రారంభించాడు. ఇప్పటికే ఒకసారి టాస్క్‌లో గెలిచిన ముకేశ్, ఓడిపోయిన దేబ్జానీ ఈసారి పోటీదారులుగా ఉండరని బిగ్ బాస్ స్పష్టం చేశాడు. వారికి టాస్క్ నిర్వహించే బాధ్యతలను అప్పగించాడు. ముకేశ్‌ను లివింగ్ రూమ్‌లో, దేబ్జానీని గార్డెన్‌లో సంచాలకులుగా నియమించారు. బజర్ మోగిన సమయంలో వర్షిణి, అమన్ విజయం సాధించారు. వీరిద్దరికీ బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. బజర్ మోగగానే పూల్‌లోకి దూకి, అక్కడ ఉన్న బ్యాగులను ఒక్కొక్కటిగా తీసుకురావాలి. వాటిని తమకు కేటాయించిన రంగు ప్లాట్‌ఫామ్‌లోకి విసరాలి. ఒకరు కిందపడితే వారి బ్యాగులను కూడా తీసుకునే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ వివరించాడు. ఈ టాస్క్‌కు ముకేశ్ సంచాలకుడిగా వ్యవహరించగా.. చివరికి అమన్ విజేతగా నిలిచాడు.

టాస్క్‌లో గెలిచిన అమన్‌కు బిగ్ బాస్ ఫోన్ చేసి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు. అనంతరం అతడి తల్లి ప్రేమగా పంపించిన ఇష్టమైన భోజనం గురించి చెప్పాడు. ఆ భోజనం అమన్‌కు కావాలంటే ఇంట్లోని మరో సభ్యుడికి టెన్షన్ ఇవ్వాలని షరతు పెట్టాడు.షాలినీకి ఆమె అక్క ప్రేమగా రాసిన ఉత్తరం లేదా రోహిత్‌కు అతడి తల్లి, చెల్లి రాసిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని బిగ్ బాస్ సూచించాడు. దీంతో అమన్.. రోహిత్‌కు టెన్షన్ ఇస్తానని నిర్ణయించుకున్నాడు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు రోహిత్‌కు వచ్చిన ఉత్తరాన్ని నాశనం చేశాడు. తన కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరం దక్కకుండా పోవడంతో రోహిత్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

మరోవైపు టెంప్టేషన్ టాస్క్‌లో సుధీర్, సృష్టి బజర్‌లో విజయం సాధించారు. వీరిద్దరికీ బిగ్ బాస్ మరో ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు. ముందుగా తాడును విసిరి మెటల్ బాల్స్‌ను తమ వైపునకు లాగుకోవాలి. ఆ తర్వాత వాటి సాయంతో టైల్స్‌ను పగలగొట్టి, లోపల ఉన్న చెక్క ముక్కలను సేకరించాలి. సేకరించిన చెక్క ముక్కలను ఉపయోగించి తమకు కేటాయించిన ప్లాట్‌ఫామ్‌పై రాడ్ సూచించిన ఎత్తు వరకు ఒక టవర్‌ను నిర్మించాలి. ఈ టాస్క్‌కు రోహిత్ సంచాలకుడిగా వ్యవహరించాడు. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి సృష్టి విజేతగా నిలిచింది.

టాస్క్‌లో విజయం సాధించిన సృష్టికి కూడా బిగ్ బాస్ టెంప్టేషన్ ఇచ్చాడు. ఆమె తల్లి ప్రేమగా రాసిన ఉత్తరాన్ని పొందాలంటే ఇంట్లోని మరో సభ్యుడికి టెన్షన్ ఇవ్వాలని చెప్పాడు. వంశీకి అతడి భార్య రాసిన ఉత్తరం లేదా త్రిగుణ్‌కు అతడి భార్య పంపిన ఉత్తరాన్ని అందకుండా చేయాలని సూచించాడు. దీంతో సృష్టి.. త్రిగుణ్‌కు టెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు త్రిగుణ్‌కు వచ్చిన ఉత్తరాన్ని నాశనం చేసింది. తన భార్య నుంచి వచ్చిన ఉత్తరం దక్కకుండా పోవడంతో త్రిగుణ్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.

మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో టెంప్టేషన్ టాస్కులు ఇంటి సభ్యుల మధ్య పోటీతో పాటు భావోద్వేగాలను కూడా పరీక్షించాయి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి పలువురిని కంటతడి పెట్టించగా.. మరోవైపు నరేష్, రామ్ ప్రసాద్ వంటి వారు సరదా సన్నివేశాలతో ఇంటి వాతావరణాన్ని కాస్త తేలికగా మార్చారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise Review | ‘ది ప్యారడైజ్’ సినిమా రివ్యూ.. జడల్‌తో నాని బ్లాక్‌బస్టర్ కొట్టాడా?RTA Offices | ఏజెంట్ల దందాకు చెక్‌..! ఆర్టీఏ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com