Bigg Boss Today Promo : నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో అమన్, షాలిని లపై గట్టిగా ఫైర్ అయి కంటెస్టెంట్స్ అందర్నీ తిట్టిన నాగార్జున గత వారం వచ్చిన వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ గురించి రేపు మాట్లాడతాను అన్నారు. తాజాగా నేడు ఆదివారం ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో మొత్తం దక్షినే హైలెట్ అయింది.
వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ అందర్నీ నిలబడమని మిగిలిన కంటెస్టెంట్స్ కి వీరిలో ఎవరికీ ఫైర్ లేదో చెప్పి మిర్చి తినిపించమన్నారు. వంశీ, ముకేశ్, అమన్ – రామకృష్ణ పేరు చెప్పగా, త్రిగుణ – నీతూ పేరు చెప్పగా రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్, సుధీర్, మరికొంతమంది దక్షి పేరు చెప్పారు. దక్షికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
Also Read : Janaki Ram : ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన మరో దర్శకుడు.. జానకిరామ్ మారెళ్ల
దీంతో ఈ వారం దక్షి డైరెక్ట్ గా నామినేషన్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ప్రోమోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇదే విషయాన్ని తెలిపారు స్టార్ మా టీమ్. దీంతో వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి నాగార్జున గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళను ఏమన్నాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
మీరు కూడా నేటి ప్రోమో చూసేయండి..






