బీహార్ లోని జముయీ సిటీలో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు, సమస్తిపూర్ లోని లత్ బసేపురాలో యువతిపై లైంగిక దాడి కేసులను ప్రస్థావిస్తూ బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలు రచ్చలేపుతున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలతో పాటు రాజకీయ విమర్శలకు దారితీశాయి. నిందుతులు రీల్స్ చేసి ఉండకపోతే దొరికేవారా..? రీల్స్ చేసి హీరోలు అవ్వాలని చూడకండి.. రీల్స్ చేస్తే దొరికిపోతారు.. 24 గంటల్లో మా పోలీసులు మీకు రియాక్షన్ చూపిస్తారు.. అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద డిబేట్ కు దారితీశాయి.
అంటే క్రైమ్ చేసినా పర్లేదు.. రీల్స్ చేసి దొరికిపోవద్దు అని నేరస్తులకు పరోక్షంగా సీఎం సలహా ఇస్తున్నారా..? అని ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు సమాజిక వేత్తలు కూడా మండిపడుతున్నారు.
ఈ రెండు ఘటనలపై మాట్లలాడుతూ సీఎం సామ్రాట్ చౌదరి.. ఇటీవల రీల్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. జమూయి ఘటనలో కూడా నిందితుడికి రీల్స్ చేసే అలవాటు ఉండటం కారణంగానే పట్టబడ్డాడు అని అన్నారు. ఈ రోజుల్లో రీల్ హీరో సంస్కృతి చాలా ఎక్కువైపోయింది. ఈ రోజుల్లో రీల్స్ తీస్తున్నారు. గత రెండు రోజులుగా నేను ఇదే చూస్తున్నాను. జనాలు కేవలం రీల్స్ తీస్తున్నారు. మా ప్రభుత్వం సుపరిపాలనకు మారుపేరు. సుపరిపాలన లేకుండా భద్రత ఉండదని నేను పదేపదే చెబుతుంటాను. అందుకే నేను నేరస్తులతో పదేపదే చెప్తుంటాను, నా పోలీసులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు వారిని రెచ్చగొడితే, 24 గంటల్లోగా మీకు సమాధానం వస్తుంది. వేరే దారి లేదు.. అని అన్నారు.
మా ప్రభుత్వం సుపరిపాలనకు మారుపేరు. సుపరిపాలన లేకుండా భద్రత ఉండదని నేను పదేపదే చెబుతుంటాను. అందుకే నేను నేరస్తులతో పదేపదే చెప్తుంటాను, నా పోలీసులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరు వారిని రెచ్చగొడితే, 24 గంటల్లోగా మీకు సమాధానం వస్తుంది. వేరే దారి లేదు.. అని అన్నారు.
Patna, Bihar: On the Jamui encounter case, Chief Minister Samrat Choudhary says, "Real hero... reels, heroes have become very common nowadays. For the past two days, I've been seeing that only reels were being made. I repeatedly say that our administration is known for good… pic.twitter.com/e3zvj9keXt
— IANS (@ians_india) September 22, 2026
మీకు నచ్చినట్లు జీవించండి, మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదు. కానీ నేరానికి పాల్పడినంత మాత్రాన సమాజంలో ఎవరూ హీరో అయిపోరు. ఈ రోజుల్లో రీల్స్ తీసే క్రమంలో ప్రజలు హత్యకు గురవుతున్నారు. జమూయి ఘటనలో ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు. అతను రీల్ తీయకపోయి ఉంటే పట్టుబడేవాడా? అలాగైతే, రీల్స్ తీసే క్రమంలో ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు? అంటూ చెప్పుకొచ్చారు.
సీఎం రీల్స్ కల్చర్ కరెక్టు కాదని చెప్పడానికి ప్రయత్నించారేమో కానీ.. అది మిస్ ఫైర్ అయ్యింది. నేరాలు చేసినా కాని రీల్స్ చేస్తే పట్టుబడతారు.. అని నేరస్తులకు సూచన చేసినట్లుగా ఉండటంతో విమర్శలు మొదలయ్యాయి.
సీఎం ఏడు హత్యలలో నిందితుడు..
సీఎం సామ్రాట్ చౌదరి వ్యాఖ్యలపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఏడు హత్యల కేసులో నిందితుడైన బీహార్ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారని తేజస్వీ అన్నారు. గూండాలతో, మిత్రమా, నేరాలను నిశ్శబ్దంగా చేయండి, కానీ రీల్స్ లేదా వీడియోలు తీయకండి. అప్పుడు మిమ్మల్ని రక్షించడం నాకు కష్టమవుతుంది అని వేడుకుంటున్నారు.
ప్రజల ఒత్తిడి వల్ల వీడియోలు వైరల్ అయినప్పుడు మాత్రమే బీహార్ పోలీసులు యాక్షన్ మొదలుపెడతారు. లేకపోతే, వారు అందరితో కుమ్మక్కై ఉంటారు. బీహార్ దేవుడి దయతో నడుస్తోంది. అన్ని వ్యవస్థలలో, యంత్రాంగంలో పాతుకుపోయిన మాఫియా ప్రజల డబ్బును, గౌరవాన్ని ఇష్టారీతిన దోచుకుంటోందంటూ విరుచుకుపడ్డారు.
बिहार के आपराधिक प्रवृति के 7 हत्याओं के आरोपी मुख्यमंत्री अब बदमाशों से निवेदन करते हुए कहते है कि चुपचाप अपराध करो यार लेकिन रील और वीडियो मत बनाओ, इससे मुझे तुम्हें बचाने में फिर दिक्कत होती है।
— Tejashwi Yadav (@yadavtejashwi) September 24, 2026
बिहार पुलिस वीडियो वायरल होने पर जनदबाव में प्रतिक्रिया स्वरूप कारवाई करने का… pic.twitter.com/7CQGc4NGF8






