☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!

18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!
18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!
18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. లేటెస్ట్ గా తన 56వ చిత్రాన్ని (D56) అధికారికంగా లాంచ్ చేశారు . బ్లాక్‌బస్టర్ 'లబ్బర్ పందు' మూవీ ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు శివగంగ జిల్లాలోని ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ధనుష్ 18 అడుగుల భారీ కొడవలి (అరివాళ్) కానుకగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

18 ఏళ్ల వివాదానికి తెర..

ఈ సినిమా లాంచ్‌ వేడుకలో వడివేలు, ధనుష్ కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. 2008లో 'పడిక్కాదవన్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు రావడం, వడివేలు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం కోలీవుడ్‌లో పెద్ద సంచలనమైంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ పూజా వేదికపై వడివేలు స్పందిస్తూ.. మూడో వ్యక్తి కల్పించిన మనస్పర్థల వల్లే మేం ఇన్ని రోజులు కలిసి పనిచేయలేకపోయాం. ఈ కథ వినగానే చాలా సర్ ప్రైజ్ అయ్యాను అని క్లారిటీ ఇచ్చారు.

క్రేజీ కాంబినేషన్..

ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తుంది. ఇక ఎస్‌జే సూర్య, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' ప్రైమ్‌మార్క్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ALSO READ : గడ్డం లేదు బాస్‌.. ఇప్పుడు ఏం చేద్దాం?

బిజీ బిజీ గా..

ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలోని 'ఓం' (OM) నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు మారినాడు ఆలయం కేంద్రంగా అంగరంగ వైభవంగా షురూ అయిన ఈ 'D56' చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వడివేలు కాంబో రిపీట్ కావడం.. 'లబ్బర్ పందు' డైరెక్టర్ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← క్రైం చేసేటప్పుడు రీల్స్ చేయొద్దంట : బీహార్ సీఎం వ్యాఖ్యలపై రచ్చకారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com