☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!

కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!
కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!
కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!

కొత్తగా కారు, బైక్ కొనేవారికి మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా మారబోతోంది. వాహన కొనుగోళ్ల సమయంలో డీలర్లు చెప్పే ఇన్సూరెన్స్ తీసుకోవాలనే నిబంధన నుంచి వాహనదారులకు విముక్తి లభించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ IRDAI కీలకమైన సంస్కరణలను ప్రతిపాదించింది. దీనివల్ల కస్టమర్లకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. కొత్త రూల్స్ ద్వారా వాహన కొనుగోలుదారులకు ఏయే ప్రయోజనాలు దక్కనున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

డైరెక్ట్ డిజిటల్ ఆప్షన్..
ఇప్పటివరకు కొత్త వాహనం కొనేటప్పుడు డీలర్లు ఏ ఇన్సూరెన్స్ చెబితే అదే తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ IRDAI కొత్త ప్రతిపాదనల ప్రకారం కస్టమర్లు నేరుగా డిజిటల్ పద్ధతిలో మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు అవకాశం లభిస్తుంది. 'బీమా సుగం' వంటి మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఇన్సూరెన్స్ పాలసీలను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా మోటార్ డీలర్లు తమ షోరూమ్‌లలో ఈ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను, ఇతర వివరాలను కస్టమర్లకు కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనివల్ల కస్టమర్లు వివిధ కంపెనీల పాలసీలను సులభంగా పోల్చుకుని.. తమకు నచ్చిన బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

డీలర్ల గుత్తాధిపత్యానికి చెక్..
కొత్త వాహనం కొనేవారికి డీలర్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం కాదని తెలియజేసేలా నిబంధనలు వస్తున్నాయి. మోటార్ డీలర్లు తప్పనిసరిగా కస్టమర్లకు ఇతర డిజిటల్ కొనుగోలు మార్గాల గురించి అవగాహన కల్పించాలి. అంతేకాకుండా కస్టమర్ మొబైల్ నంబర్‌ను పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీకి షేర్ చేస్తారు. ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో వెరిఫై అయ్యాక, కస్టమర్‌కు నేరుగా మెసేజ్ వస్తుంది. దీనివల్ల డీలర్లు చెప్పిన ఇన్సూరెన్స్‌పైనే ఆధారపడకుండా వేరే కంపెనీల పాలసీలు కూడా ఉన్నాయని కస్టమర్లకు స్పష్టత వస్తుంది.

వేరే చోట ఇన్సూరెన్స్ కొంటే రిపేర్ల నిరాకరణ కుదరదు..
చాలామందికి ఉండే అతిపెద్ద సందేహం ఏమిటంటే.. డీలర్ వద్ద కాకుండా బయట వేరే చోట ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు షోరూమ్‌లో క్యాష్‌ లెస్ రిపేర్లు చేస్తారా లేదా అని. ఈ సమస్యకు IRDAI చెక్ పెట్టింది. కస్టమర్ ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే.. కేవలం ఆ కారణంతో మోటార్ డీలర్లు క్యాష్‌ లెస్ రిపేర్ సర్వీస్‌లను నిరాకరించడానికి నిబంధన పెట్టింది. ఇది పాలసీదారులకు చాలా పెద్ద రక్షణగా నిలవనుంది.

కమీషన్ల భారం తగ్గి.. ప్రీమియంలు తగ్గే అవకాశం
ప్రస్తుతం మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో డిస్ట్రిబ్యూషన్ కమీషన్లు చాలా ఎక్కువగా (సగటున 24% వరకు) ఉంటున్నాయి. దీనివల్ల కార్లు, బైకులు కొనుక్కునే కస్టమర్లపై అదనపు భారం పడుతోంది. ఈ అనవసర ఖర్చులను తగ్గించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నిర్ణయించింది. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్, సులభంగా అమ్ముడయ్యే మోటార్ పాలసీలపై కమీషన్లను భారీగా తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ ప్లాన్ కనుక అమల్లోకి వస్తే.. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు తగ్గి కస్టమర్లకు మరింత తక్కువ ధరకే కవరేజ్ లభిస్తుంది.

మొత్తానికి ఐఆర్డీఏఐ తెస్తున్న ఈ కొత్త సంస్కరణలు అమలైతే వాహన కొనుగోలుదారులకు మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు అనేక ఆప్షన్స్ అందుబాటులోకి రావటంతో పాటు ఆటోమెుబైల్ ఏజెన్సీల హైకాస్ట్ ఇన్సూరెన్స్ ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్తి స్వేచ్ఛ రావటంతో ఎవరి బలవంతం లేకుండా తమకు నచ్చిన పాలసీని తక్కువ ధరకే ఎంచుకునే అవకాశం కస్టమర్లకు దక్కనుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← 18 ఏళ్ల శత్రుత్వం.. ఒకే వేదికపై ధనుష్-వడివేలు.. గ్రాండ్‌గా 'D56' మూవీ లాంచ్!SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com