☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

BJP State Incharges: తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. 28 రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. ప్రకటించిన బీజేపీ అధిష్టానం

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు(BJP State Incharges), సహ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
BJP State Incharges: తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. 28 రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు.. ప్రకటించిన బీజేపీ అధిష్టానం

BJP State Incharges: భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, సహ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు విడుదల చేశారు. ఈ కీలక నియామకాల్లో భాగంగా తెలంగాణకు చెందిన మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌గా(BJP State Incharges) బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను అప్పగించిన జాతీయ నాయకత్వానికి, పార్టీ అగ్రనేతలకు డీకే అరుణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీకి చెందిన ప్రముఖ నేత దగ్గుబాటి పురందేశ్వరిని ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. సోషల్ మీడియా ఫేక్ న్యూస్‌పై ఫైర్.. మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణ నేతలకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు:

తెలంగాణలోని సీనియర్ నేతలకు అధిష్టానం ఇతర రాష్ట్రాల నిర్వహణ బాధ్యతల్లో చోటు కల్పించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, గతంలో ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన కాసం వెంకటేశ్వర్లును కర్ణాటక రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న కీలక నేతలకు పొరుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణ ఇన్‌ఛార్జ్‌లుగా పాత నేతల కొనసాగింపు:

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధిష్టానం మునుపటి ఇన్‌ఛార్జ్ బృందాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్ తమ బాధ్యతల్లో కొనసాగనుండగా, ఆయనతో పాటు సహ ఇన్‌ఛార్జ్‌లుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలు సేవలందించనున్నారు. రాష్ట్రంలో పార్టీ రాజకీయ స్థితిగతులు మరియు రాబోయే కార్యాచరణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు అనుభవం ఉన్న బృందాన్నే కొనసాగించడానికే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Film Federation : ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమ‌ల‌త కార్య‌వ‌ర్గం ర‌ద్దు..Mirabai Chanu : 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చానుకు ర‌జ‌తం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com