Film Federation : టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసింది.
ఇటీవల డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వివాదంపై చర్చించేందుకు సుమలత, రఘు మాస్టర్‌లతో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరు అయ్యారు. సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలిపారు. రఘు మాస్టర్‌కు ఏకంగా 214 మంది డ్యాన్సర్లు మద్దతు ప్రకటించారు.
Anchor Sravanthi : లంగావోణీలో యాంకర్ స్రవంతి.. భారీ హారం వేసుకొని.. ఎంత ముద్దుగా ఉందో.. ఫొటోలు..
ఈ క్రమంలోనే సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.






