న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత , మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించింది. ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 98 ఏళ్లా అద్వానీని శుక్రవారం రాత్రి 7.30 నిమిషాలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పల్మోనరీ శాఖలో ఆయన్ను అడ్మిట్ చేశారు. డాక్టర్ల బృందం ఆయన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అద్వానీ తరుచూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో మే నెలలో అపోలో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కావడానికి ముందు ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. డిసెంబర్ 2024లో ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. న్యూరాలజిస్ట్ సమక్షంలో అప్పుడు ఆయన ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడ కావడంతో డిశ్చార్జ్ చేశారు.
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.






