Engineering Student | దసరా సెలవులు కావడంతో స్వస్థలానికి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థి తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిపోయాడు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడులో గుండెపోటుతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతులకు కుమార్తె కీర్తి, కుమారుడు రాఘవ ఉన్నాడు. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవ దసరా పండగ సెలవులు కావడంతో రెండ్రోజుల క్రితమే ఇంటికొచ్చాడు.
ఇవాళ ఉదయం దుస్తులు అమ్మే వ్యక్తి బైకుపై వీరి ఇంటి వద్దకు వచ్చాడు. రాఘవ తల్లి ఆ దుస్తులు కొనేందుకు వాటిని చూస్తుండగా.. నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి అంటూ రాఘవ మంచంపై కూర్చుంటూనే కింద పడిపోయాడు. దీంతో వెంటనే రాఘవకు సీపీఆర్ చేసి, ఆటోలో వైరాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు పరీక్షించి గుండెపోటుతో మృతిచెందాడని నిర్ధారించారు.
Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు






