☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు

పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు
పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు
పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో మానసిక క్షోభకు గురవుతున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు పేర్కొనడం సిగ్గుచేటని బీజేపీ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​ వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. ‘ఎంపీ ఎన్నికల్లో రూ.10 కోట్లు తీసుకొని ఓట్లేయించినప్పుడు, నీ ఇంట్లో ప్రెస్​మీట్ పెట్టినప్పుడు వంశీకృష్ణ దళిత కార్డు గుర్తు రాలేదా?’ అని ప్రశ్నించారు.

బుధవారం ఆయన మంచిర్యాలలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ప్రేమ్​సాగర్​రావు ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర ఏండ్ల కాలంలోనే రూ.470 కోట్ల బ్యాంకు లోన్లు తీర్చాడంటే నియోజకవర్గంలో ఎంత దోపిడీ చేశాడో అర్థమవుతోందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైసల కోసం ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించిన చరిత్ర నీదని గుర్తు చేశారు. ‘నీకు డబ్బు వచ్చే పనులకు ప్రయారిటీ ఇస్తావు. తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవు’ అని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ర్యాలీలు, మీటింగుల నిర్వహణలో పోటీ పడడం కాదని, డెవలప్​మెంట్​లో పోటీ పడాలని హితవు పలికారు.

వారికి ఫ్లెక్సీలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. వారి గొడవల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. పీఎస్సార్​ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంచిర్యాల ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి దళితులపై నిజమైన ప్రేమ ఉంటే చేవెళ్ల డిక్లరేషన్​ను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు : ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్సింగరేణి లాభాల్లో రిటైర్డు ఉద్యోగులకు వాటా ఇవ్వాలి : సింగరేణి రిటైర్డు ఉద్యోగులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com