☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sudhanshu Trivedi | స‌ర్‌ను వ్య‌తిరేకించ‌డ‌మే దేశ ద్రోహం.. రాహుల్‌గాంధీ వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్‌..!

Sudhanshu Trivedi | స‌ర్ (SIR) ప్రక్రియ‌ను విమర్శిస్తూ, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ (Chief Election Commissioner) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మీడియా కాన్ఫ‌రెన్స్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ (BJP) కౌంట‌ర్ ఇచ్చింది. రాహుల్‌గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) విమ‌ర్శించారు.
Sudhanshu Trivedi | స‌ర్‌ను వ్య‌తిరేకించ‌డ‌మే దేశ ద్రోహం.. రాహుల్‌గాంధీ వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్‌..!

Sudhanshu Trivedi : స‌ర్ (SIR) ప్రక్రియ‌ను విమర్శిస్తూ, చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌ (Chief Election Commissioner) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) మీడియా కాన్ఫ‌రెన్స్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ (BJP) కౌంట‌ర్ ఇచ్చింది. రాహుల్‌గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) సుధాన్షు త్రివేది (Sudhanshu Trivedi) విమ‌ర్శించారు. కాంగ్రెస్ పతనానికి సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్‌గాంధీనే కారణమని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘంలో కమిషనర్ల విభేదాలపై ఎన్నికల అధికారులు ఎవరూ కూడా స్పందించలేదన్నారు.

సర్ ప్రక్రియను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని, సర్ ప్రక్రియను వద్దంటే దేశద్రోహానికి పాల్పడినట్లేనని సుధాన్షు వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తంచేసిందని గుర్తుచేశారు. ఆ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. అస్సాం, బెంగాల్‌లో సర్ ద్వారా ఓట్లు తొలగించారని, నిజాలు తెలియకుండా రాహుల్ గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సుధాన్షు మండిపడ్డారు. రాహుల్, ఆయన చెల్లి ప్రియాంకాగాంధీ వాద్రాకు సొంత రాష్ట్రంలో గెలిచే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.

అందుకే వయనాడ్‌లో ముస్లిం లీగ్ మద్దతుతో ఆ ఇద్దరూ గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భారీ ఎత్తున‌ రిగ్గింగ్, ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Telangana | బ్రేకింగ్.. 22A భూములపై ప్రభుత్వం సంచలన ప్రకటన..!Asia Cup Select | అండర్‌-15 ఆసియాకప్‌ పోటీలకు వరంగల్‌ క్రీడాకారిణి ఎంపిక →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com