☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asia Cup Select | అండర్‌-15 ఆసియాకప్‌ పోటీలకు వరంగల్‌ క్రీడాకారిణి ఎంపిక

Asia Cup Select | అండర్‌-15 ఆసియాకప్‌ పోటీల్లో ఇండియన్‌ సాఫ్ట్‌బాల్‌ జట్టులో ఆడేందుకు వరంగల్‌ క్రీడాకారిణి వేల్పుల సాయివర్షిని ఎంపిక అయ్యింది.
Asia Cup Select | అండర్‌-15 ఆసియాకప్‌ పోటీలకు వరంగల్‌ క్రీడాకారిణి ఎంపిక

హనుమకొండ చౌరస్తా : అండర్‌-15 ఆసియాకప్‌ (Asia Cup ) పోటీల్లో ఇండియన్‌ సాఫ్ట్‌బాల్‌ ( Softball ) జట్టులో ఆడేందుకు వరంగల్‌ క్రీడాకారిణి వేల్పుల సాయివర్షిని ( Velpula Sai Varshini ) ఎంపిక అయ్యింది. చైనాలో అక్టోబర్‌ 12 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న 5వ అండర్‌-15 ఉమెన్స్​‍ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ఆమె పాల్గొననుందని హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ తాబేటి రాజేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్‌ శ్వేత ( CP Swetha) ను మర్యాదపూర్వకంగా కలవడంతో ఆమె క్రీడాకారిణిని అభినందించారు. సీపీ మాట్లాడుతూ ఇండియన్‌ టీంకు సాయివర్షిని ఎంపిక కావడం అభినందనీయమని కొనియాడారు. సాయివర్షినినీ క్రీడాకారిణిగా ఎదిగేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్‌ పోలేపాక వినయ్‌ , సాయివర్షిని తండ్రి అనిల్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు, కోచ్‌ ఉన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sudhanshu Trivedi | స‌ర్‌ను వ్య‌తిరేకించ‌డ‌మే దేశ ద్రోహం.. రాహుల్‌గాంధీ వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్‌..!Asian Games | మిక్స్‌డ్ రీలేలో రజతం.. మారథాన్‌లో సీమకు చరిత్రాత్మక కాంస్యం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com