☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games | మిక్స్‌డ్ రీలేలో రజతం.. మారథాన్‌లో సీమకు చరిత్రాత్మక కాంస్యం..!

Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఐదో రోజు షూటర్లు వెండి వెలుగులు విరజిమ్మగా.. అథ్లెట్లు కూడా పోడియంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
Asian Games | మిక్స్‌డ్ రీలేలో రజతం.. మారథాన్‌లో సీమకు చరిత్రాత్మక కాంస్యం..!

Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఐదో రోజు షూటర్లు వెండి వెలుగులు విరజిమ్మగా.. అథ్లెట్లు కూడా పోడియంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. పది వేల మీటర్ల పరుగులో సీమా కుమారి కంచు మోత మోగించింది. సీమ కాంస్యం అందుకున్న ఇరవై నిమిషాల్లోనే మిక్స్‌డ్ రీలే(4×400 మీటర్ల) ఫైనల్లో భారత బృందం రజతం ఒడిసిపట్టింది. ఫలితంగా భారత్ ఖాతాలో 17 పతకాలు చేరాయి.

జపాన్‌లోని నగోయలో జరుగుతున్న పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకపోరులో దూసుకెళ్తున్నారు. మిక్స్‌డ్ రీలే (4×400 మీటర్ల) విభాగంలో . మిక్స్‌డ్ విభాగం ఫైనల్లో పూవమ్మ రాజు, విశాల్ థెన్నరసు, విథ్యా రామరాజు, మను టీఎస్‌లు రెండో స్థానంతో రజతం గెలుపొందారు. గురువారం ఫైనల్లో.. విథ్యా, విశాల్ చిరుతలా పరుగెత్తారు. వీరి కృషి ఫలితంగా ఈ టోర్నీలో తమ రికార్డును కాపాడుకుంది మిక్స్‌డ్ రీలే బృందం. ఇదివరకు 2018లో స్వర్ణం, 2022 ఎడిషన్‌లో భారత టీమ్ రజతం గెలుపొందింది.

అంతకుముందు.. మహిళల 10 వేల మీటర్ల పరుగులో సీమా కుమారి సత్తా చాటింది. ఈ మారథాన్ రేసులో 16 ఏళ్లుగా పతకం కోసం నిరీక్షిస్తున్న భారత్‌ను సంబురాల్లో ముంచెత్తింది. ఫైనల్లో 32:50:05 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని ముద్దాడిందీ హిమాచల్ ప్రదేశ్ అథ్లెట్. ఆమె మూడో స్థానానికి పరిమితమవ్వగా.. విన్‌ఫ్రెడ్ యవీ(బహ్రెయిన్) పసిడి, నొజొమి(జపాన్) వెండి పతకాలు సాధించారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో విఫలమైన భారత చిరుత గురిందెర్విర్ సింగ్ ఈసారి అంచనాలు అందుకున్నాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడితో పాటు ఇండియన్ బోల్ట్ అనిమేశ్ కుజుర్‌ సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల కబడ్డీలో భారత జట్టు దర్జాగా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో తో చైనీస్ తైపీని ఇండియా చిత్తు చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asia Cup Select | అండర్‌-15 ఆసియాకప్‌ పోటీలకు వరంగల్‌ క్రీడాకారిణి ఎంపికRahul Gandhi | ఓటు చోరీతో ఎంపీలైన వాళ్లు చేసే చ‌ట్టాలు చెల్ల‌వు.. సీఈసీ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి : రాహుల్‌గాంధీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com