☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

వైభవంగా దసరా ఉత్సవాలు: మహాలక్ష్మి దేవిగా.. బోడుప్పల్ బంగారు మైసమ్మ తల్లి

వైభవంగా దసరా ఉత్సవాలు: మహాలక్ష్మి దేవిగా.. బోడుప్పల్ బంగారు మైసమ్మ తల్లి
వైభవంగా దసరా ఉత్సవాలు: మహాలక్ష్మి దేవిగా.. బోడుప్పల్ బంగారు మైసమ్మ తల్లి
వైభవంగా దసరా ఉత్సవాలు: మహాలక్ష్మి దేవిగా.. బోడుప్పల్ బంగారు మైసమ్మ తల్లి

దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోడుప్పల్​ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో శనివారం ( అక్టోబర్​ 17) బంగారు మైసమ్మ తల్లి .. మహాలక్ష్మి దేవిగా భక్తులను ఆశీర్వదించారు.

బోడుప్పల్ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర దేవాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా వేద పండితులు.. ఆలయ చైర్మన్​ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి. నిత్యం హోమాలు.. ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నిత్యం లలితాసహస్రనామ పారాయణం.. హోమాలు.. నీరాజన.. మంత్ర పుష్పాలు , తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం (అక్టోబర్​17) బోడుప్పల్​ బంగారు మైసమ్మ మహంకాళేశ్వర దేవాలంలో చండిహోమంతో పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు.

దసరా ఉత్సవాల్లో అమ్మవారు రోజుకొక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ చైర్మన్​ బొమ్మక్​ శివ పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ( అక్టోబర్​ 18)న అమ్మవారు దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. ఇంకా బంగారు మైసమ్మ తల్లి.. మహిషాసుర మర్థిని.. రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయప్రాంగణంలో ఆధ్యాత్మికకు.. సంస్కృతి సంప్రదాయాలకు.. ఆచారాలకు పెద్ద పీట వేస్తూ శమీపూజ.. రావణదహనం ..ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జగన్మాత ఆశీస్సులు పొందాలని చైర్మన్​ బొమ్మక్​ శివ విఙ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← స్థానిక ఎన్నికలు: పోలింగుకు 48 గంటల ముందే మద్యం షాపులు బంద్నీతి కథ: అతిగా ఆశపడితే ఏమవుతుందో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com