☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

నీతి కథ: అతిగా ఆశపడితే ఏమవుతుందో తెలుసా?

నీతి కథ: అతిగా ఆశపడితే ఏమవుతుందో తెలుసా? Caption of Image. అతి దానాత్‌ హతః కర్ణః అతి లోభాత్‌ సుయోధనః అతి కామాత్‌ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్‌ విచ్చల విడిగా (కవచ కుండలాల్ని) దానం చేయడం వలన కర్ణుడు, మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు, అతి కామం చేత రావణుడు నాశనమయ్యారు. కనుక ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు. ‘అతి’ని విడిచిపెట్టాలి... అని ఈ శ్లోకం చెబుతోంది. కొందరు అతిగా మాట్లాడతారు. సత్యం పలికేవాడు మితంగా మాట్లాడతాడు. అసత్యం పలికేవాడు అతిగా మాట్లాడతాడు. అసత్యాన్ని నిరూపించడానికి మాట్లాడుతూనే ఉండాలి. ‘రాముడు మంచి బాలుడు’ అని ఒక్క ముక్కలో చెప్తే చాలు. అదే రావణుడి గురించి మంచివాడు అని పలకాలంటే, రావణుడిలో లేని సుగుణాలను ఉన్నట్లుగా నిరూపించాలి. అందుకోసం అతిగా మాట్లాడుతూనే ఉండాలి. ఇక కొందరు అతిగా తింటా
నీతి కథ: అతిగా ఆశపడితే ఏమవుతుందో తెలుసా?
నీతి కథ: అతిగా ఆశపడితే ఏమవుతుందో తెలుసా?

అతి దానాత్‌ హతః కర్ణః
అతి లోభాత్‌ సుయోధనః
అతి కామాత్‌ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్‌

విచ్చల విడిగా (కవచ కుండలాల్ని) దానం చేయడం వలన కర్ణుడు, మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు, అతి కామం చేత రావణుడు నాశనమయ్యారు. కనుక ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు. ‘అతి’ని విడిచిపెట్టాలి... అని ఈ శ్లోకం చెబుతోంది.

కొందరు అతిగా మాట్లాడతారు. సత్యం పలికేవాడు మితంగా మాట్లాడతాడు. అసత్యం పలికేవాడు అతిగా మాట్లాడతాడు. అసత్యాన్ని నిరూపించడానికి మాట్లాడుతూనే ఉండాలి. ‘రాముడు మంచి బాలుడు’ అని ఒక్క ముక్కలో చెప్తే చాలు. అదే రావణుడి గురించి మంచివాడు అని పలకాలంటే, రావణుడిలో లేని సుగుణాలను ఉన్నట్లుగా నిరూపించాలి. అందుకోసం అతిగా మాట్లాడుతూనే ఉండాలి. ఇక కొందరు అతిగా తింటారు. బకాసురుడి గురించి మహాభారతంలో ఒక కథ ఉంది. బకాసురుడి ఆహారం... ఒ మనిషి, రెండు దున్నపోతులు, బండెడు అన్నంతో వివిధ రకాల వంటలు. అంత అతిగా తినేవాడికి బుద్ధిబలం ఉండదు. కేవలం కండబలం మాత్రమే ఉంటుంది. అంతటి ఆహారం సేవించే బకాసురుడి ని భీముడు వధించాడు.

మితాహారం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెప్తోంది. భస్మాసురుడు మొదలైన రాక్షసులు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశారు. పరమశివుడు ప్రత్యక్షం కాగానే, ‘తాను ఎవరి తల మీద చేయి పెడితే వారు మరణించాలి’ అని వరం కోరుకున్నాడు. ఆ వరమే భస్మాసురుడి పాలిటి శాపం అయింది. జగన్మోహిని కారణంగా... తన తల మీద తాను చేయి పెట్టుకుని భస్మమైపోయాడు. ఇక హిరణ్యకశిపుడు, తనకు పగలు కాని, రాత్రి కాని, ఇంటి లోపల కాని, ఇంటి బయట కాని, మానవుల చేత కాని, జంతువుల చేత కాని మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. ఆ వరాన్ని అనుగ్రహించాడు విష్ణువు. రాత్రి పగలు కాకుండా మధ్యాహ్న సమయంలో, గడప మీద నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని తన గోళ్లతో సంహరించాడు. ఒక మహారాజు ‘తాను ముట్టుకున్నదల్లా బంగారంగా మారాలి’ అని వరం కోరుకున్నాడు.

భగవంతుడు అనుగ్రహించాడు. ఆ మహారాజు అన్నం తిందామని ముట్టుకుంటే బంగారంగా మారిపోయింది. మంచినీళ్లు తాగుదామనుకుంటే ఆ నీరు బంగారంగా మారిపోయింది. తన కూతురిని ఎత్తుకుందామనుకుంటే, ఆ పాప బంగారంగా మారిపోయింది. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. మళ్లీ భగవంతుని ప్రార్థించాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ‘స్వామీ! నా తప్పు నేను తెలుసుకున్నాను. నాకు ఆశ ఉంటే పరవాలేదు. కాని అత్యాశకు పోయాను. తగిన శాస్తి జరిగింది. నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసేసుకో’ అన్నాడు. ‘తథాస్తు’ అన్నాడు భగవంతుడు.

అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉన్నారు. ఇద్దరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకనాడు రామయ్య పొయ్యిలోకి కట్టెల కోసం అడవికి వెళ్లాడు. తన గొడ్డలితో చెట్టు కొడుతున్నాడు. అంతలో తన చేతిలో ఉన్న గొడ్డలి కింద ఉన్న నదిలో పడిపోయింది. ఆ నదీ దేవత ప్రత్యక్షమై, ‘ఇదిగో నీ గొడ్డలి, తీసుకో’ అని ఒక బంగారు గొడ్డలి ఇచ్చింది. అందుకు రామయ్య, ‘తల్లీ, ఇది నాది కాదు’ అన్నాడు. అప్పుడు ఆ నదీ దేవత వెండి గొడ్డలి తెచ్చి, ‘ఇదిగో నీ గొడ్డలి, తీసుకో’ అంది. అందుకు రామయ్య, ఇది నా గొడ్డలి కాదు అని మళ్లీ సమాధానమిచ్చాడు. అప్పుడు నదీ దేవత అసలు గొడ్డలి తీసుకువచ్చి, ‘ఇదిగో నీ గొడ్డలి తీసుకో’ అంది. అప్పుడు రామయ్య, ‘తల్లీ! నా గొడ్డలి ఇదే’ అని తీసుకున్నాడు.

రామయ్య నిజాయితీకి సంతోషించిన నదీ దేవత, అసలు గొడ్డలితో పాటు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా ఇచ్చింది. రామయ్య సంతోషంతో ఇల్లు చేరాడు. జరిగిన విషయం తెలుసుకున్న సోమయ్య, తన గొడ్డలి తీసుకుని అడవికి వెళ్లాడు. చెట్టు కొడుతూ, కావాలనే తన గొడ్డలిని నీటిలో పడేశాడు. నదీ దేవత ప్రత్యక్షమై రామయ్యని అడిగినట్లే అడిగింది. అత్యాశతో ఉన్న సోమయ్య, నదీ దేవత బంగారు గొడ్డలి తీసుకురాగానే, ‘ఇదే నా గొడ్డలి’ అన్నాడు. అతని అత్యాశకు, అసత్యానకి కోపగించుకున్న నదీ దేవత, సోమయ్యకు అసలు గొడ్డలి కూడా ఇవ్వకుండా మాయమైపోయింది. సోమయ్య తన తప్పు తెలుసుకున్నాడు. అతిగా ఆశపడటం వల్లే తనకు నష్టం జరిగిందని బాధపడ్డాడు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు.

- డా. పురాణపండ వైజయంతి

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← వైభవంగా దసరా ఉత్సవాలు: మహాలక్ష్మి దేవిగా.. బోడుప్పల్ బంగారు మైసమ్మ తల్లిఇంద్రకీలాద్రిపై దసరా సందడి: విజయవాడలో భక్తుల రద్దీ...దుర్గాదేవిని దర్శించుకుంటున్న భక్తులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com