☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!

దసరా పండుగ వేళ మేకలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో దొంగలు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డారు. పండుగ సందర్భంగా మాంసం విక్రయాల కోసం ఖర్చు లేకుండా లాభపడాలనే దురాశతో దుండగులు ఏకంగా కారులో వచ్చి మేకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్వెల్లిగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది. ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర అశోక్ అనే బాధితులు దసరా పండుగ సందర్భంగా తమ మేకలను, మేకపోతులను […]
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!

దసరా పండుగ వేళ మేకలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో దొంగలు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డారు. పండుగ సందర్భంగా మాంసం విక్రయాల కోసం ఖర్చు లేకుండా లాభపడాలనే దురాశతో దుండగులు ఏకంగా కారులో వచ్చి మేకలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్వెల్లిగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర అశోక్ అనే బాధితులు దసరా పండుగ సందర్భంగా తమ మేకలను, మేకపోతులను విక్రయించి మంచి ఆదాయం పొందవచ్చని ఆశించారు. అయితే, అక్టోబర్ 17వ తేదీన అర్ధరాత్రి వేళ మహీంద్రా కారులో వచ్చిన గుర్తుతెలియని ముఠా, కంటి రెప్పపాటులో మేకలను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే లేచి చూసేసరికి తమ మేకలు కనిపించకపోవడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురై మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు.

పండుగ వేళ కష్టపడి పెంచుకున్న జీవాలు దొంగతనానికి గురికావడంతో బాధితులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొని కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దొంగలు ఉపయోగించిన మహీంద్రా కారు నంబర్ , ప్రయాణించిన మార్గాన్ని ఆధారంగా చేసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పండుగ రోజుల్లో పెరిగిన మాంసం డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాల పట్ల జీవాల పెంపకందారులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com