☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..

Kolkata Durga Puja Pandal Stampede: కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా పండాల్‌లో భారీ వర్షం, పండాల్ కూలిపోతుందనే అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తించింది. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక తాజాగా ఈ ఘటనపై గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ రూపక్ దాస్ వివరణ ఇచ్చారు. రూపక్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..

Kolkata Durga Puja Pandal Stampede: కోల్‌కతాలోని ఓ దుర్గా పూజా పండాల్‌లో భారీ వర్షం, పండాల్ కూలిపోతుందనే అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తించింది. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక తాజాగా ఈ ఘటనపై గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ రూపక్ దాస్ వివరణ ఇచ్చారు. రూపక్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అక్టోబర్ 17వ తేదీన రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య ఉత్తర కోల్‌కతాలోని గిరీష్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10/1, రాధా మాధవ్ సాహా లేన్‌లో ఉన్న ‘చోర్‌బాగన్ సర్బోజనిన్ (శారద పార్క్)’ దుర్గా పూజా పండాల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పండాల్ పరిస్థితి క్షీణించిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని నిర్వాహకులు మైక్‌లో అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో అక్కడి జనాల్లో ఒక్కసారిగా భయం పట్టుకుంది. పండాల్‌ నుంచి బయటపడేందుకు సందర్శకులు ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు తీయడంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే సబ్-ఇన్‌స్పెక్టర్ రూపక్ దాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చాలా మంది గాయపడి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని ఆయన గుర్తించారు. వెంటనే పోలీసు సిబ్బంది, స్థానికులు కలిసి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆ తర్వాత ప్రమాద స్థలాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, ఎవరూ లోపలికి వెళ్లకుండా కార్డన్ చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించగా.. సబ్-ఇన్‌స్పెక్టర్ రూపక్ దాస్ కూడా అక్కడకు వెళ్లి బాధితుల పరిస్థితిని పరిశీలించారు. చికిత్స పొందుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. ఈ దుర్ఘటనలో మరణించిన వారిని అభిషేక్ శ్రీవాస్తవ్ (38), శ్రీపర్ణ పొద్దార్ (26), మిథు మోండల్ (45), ఆకృతి కుమారి (17), బర్ నాలి హల్దార్ (17), శుభమ్ సోంకర్ (32), ఆర్తి సర్కార్ బిస్వాస్ (45), కల్పన జనా (46), తానియా బిస్వాస్ (18), టగర్ భేజ్ (37)లుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సబ్-ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆధారంగా పోలీసులు తదుపరి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com