☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!

Comedian Ramachandra Gets Financial Aid from Hero Sanjosh: బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న టాలీవుడ్ కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. తాజాగా రామచంద్రను పరామర్శించిన సంజోష్.. ఆయన వైద్య ఖర్చుల కోసం తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో ఉన్న తోటి సినీ కళాకారుడికి సాయం చేసిన సంజోష్.. తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సంజోష్ ఇంతకుముందు కూడా చాలా మందికి తన వంతు ఆర్థిక […]
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!

Comedian Ramachandra Gets Financial Aid from Hero Sanjosh: బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న టాలీవుడ్ కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. తాజాగా రామచంద్రను పరామర్శించిన సంజోష్.. ఆయన వైద్య ఖర్చుల కోసం తన వంతు ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో ఉన్న తోటి సినీ కళాకారుడికి సాయం చేసిన సంజోష్.. తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సంజోష్ ఇంతకుముందు కూడా చాలా మందికి తన వంతు ఆర్థిక సాయం అందించారు.

కమెడియన్ రామచంద్ర చికిత్స కోసం ఇంకా సుమారు రూ.8 లక్షలు అవసరమని తెలుసుకున్న హీరో సంజోష్.. ఆయనకు మరింత సహాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రామచంద్ర కోరారు. దీనిపై స్పందించిన సంజోష్.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అన్నకు చేరవేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రామచంద్రకు మరింత సహాయం అందించేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ముందుకు రావాలని ఆయన కోరారు. సినిమా కుటుంబం ఒక్కటై రామచంద్రకు అండగా నిలిస్తే చికిత్సకు అవసరమైన సాయం అందుతుందన్నారు.

వెంకీ సినిమాలో ‘బుజ్జి’ పాత్రతో రామచంద్రకు మంచి గుర్తింపు వచ్చింది. వెంకీ, దుబాయ్ శీను, సొంతం, దరువు వంటి పలు హిట్ సినిమాల్లో హాస్య పాత్రల్లో నటించారు. రామచంద్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన తమ్ముడు దగ్గర ఉంటున్నారు. రామచంద్ర త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com