☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!

DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ప్రవేశపెట్టిన కర్మయోగి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రెడీ-టు-మూవ్ ఫ్లాట్లపై 25 శాతం రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ విధానంలో కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారు 2026 అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీలో సొంత […]
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!

DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ప్రవేశపెట్టిన కర్మయోగి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రెడీ-టు-మూవ్ ఫ్లాట్లపై 25 శాతం రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ విధానంలో కొనసాగుతోంది. ఆసక్తి ఉన్నవారు 2026 అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీలో సొంత ఇల్లు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ పథకం కింద అర్హత పొందవచ్చు. అలాగే అర్హులైన పోలీసు సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, బుకింగ్‌కు ముందు అధికారికంగా పేర్కొన్న అర్హత నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

నరేలా ప్రాంతంలో 936 ఫ్లాట్లు
DDA కర్మయోగి ఆవాస్ యోజనలో భాగంగా ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో మొత్తం 936 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజ్-6లోని సెక్టార్లు A1 నుంచి A4 వరకు ఈ ఫ్లాట్లు ఉన్నాయి. ఉద్యోగుల అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా 1BHK, 2BHK, 3BHK విభాగాల్లో ఇళ్లను అందిస్తున్నారు.

ఫ్లాట్ల రకం, ధరల వివరాలు
ఈ పథకం కింద అందుబాటులో ఉన్న ఫ్లాట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
* 1BHK: 256 ఫ్లాట్లు.. ప్రారంభ ధర సుమారు రూ.33.51 లక్షలు.
* 2BHK: 448 ఫ్లాట్లు.. ప్రారంభ ధర సుమారు రూ.75.60 లక్షలు.
* 3BHK: 232 ఫ్లాట్లు.. ప్రారంభ ధర సుమారు రూ.1.06 కోట్లు.
ఇవి సూచనాత్మక ప్రారంభ ధరలు మాత్రమే. 25 శాతం రాయితీ వర్తింపజేసిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం, ఇతర అదనపు ఛార్జీలు, చెల్లింపు నిబంధనలను DDA అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు..

ఫ్లాట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకం కింద ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే అర్హులు DDA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. అక్కడ అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఫ్లాట్ల కేటాయింపు ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్డ్ విధానంలో జరుగుతున్నందున, తమకు కావాల్సిన ఫ్లాట్ అందుబాటులో ఉందో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి.

బుకింగ్ చేసే ముందు ఫ్లాట్ ఉన్న ప్రాంతం, వర్తించే ధర, రాయితీ, చెల్లింపు విధానం, అర్హత నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2026 అక్టోబర్ 31. గడువు సమీపిస్తున్నందున ఆసక్తి ఉన్న ఉద్యోగులు ముందుగానే వివరాలు తెలుసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. నరేలా ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ పథకం అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తోంది. అయితే, ధరలు, రాయితీ, అందుబాటులో ఉన్న ఫ్లాట్ల వివరాలను అధికారిక DDA సమాచారంతో ధ్రువీకరించుకున్న తర్వాతే బుకింగ్ చేసుకోవడం మంచిది.. మొత్తంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవాలి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com