☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!

Sangameswara Temple: అలంపూర్ జోగులాంబ, శ్రీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మ, అమరావతి అమరేశ్వరుడు, మట్టంపల్లి నరసింహస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు.. ఇలా ఎందరో దేవతలు కృష్ణా నది ఒడ్డున కొలువై పూజలు అందుకుంటున్నారు. కానీ కర్నూలు జిల్లాలోని సప్త నదుల సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరుడి పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా నది నీటిలో పూర్తిగా మునిగి తేలే ఈ స్వామి.. సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే ఈసారి […]
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!

Sangameswara Temple: అలంపూర్ జోగులాంబ, శ్రీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మ, అమరావతి అమరేశ్వరుడు, మట్టంపల్లి నరసింహస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు.. ఇలా ఎందరో దేవతలు కృష్ణా నది ఒడ్డున కొలువై పూజలు అందుకుంటున్నారు. కానీ కర్నూలు జిల్లాలోని సప్త నదుల సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరుడి పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా నది నీటిలో పూర్తిగా మునిగి తేలే ఈ స్వామి.. సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే ఈసారి ఊహించని రీతిలో స్వామివారు చాలా ముందుగానే నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద నీరు చేరలేదు. ప్రతి వర్షాకాలంలో శ్రీశైలం జలాశయం నిండి గేట్లు ఎత్తడం, పాతాళగంగ ఉరకలెత్తడం ఆనవాయితీగా వచ్చేది. కానీ ఈ సీజన్‌లో కనీసం ఒక్కసారి కూడా ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి రాలేదు. రోజురోజుకూ ప్రాజెక్టులో నీటిమట్టం పాతాళానికి పడిపోతుండటంతో, మొన్నటివరకు నీటిలో మునిగి ఉన్న సంగమేశ్వరుని ఆలయం చాలా వేగంగా ఇప్పుడు బయటపడుతోంది. సాధారణంగా నదీ ప్రవాహం జోరుగా ఉండే ఏళ్లలో సంగమేశ్వర ఆలయం ఉగాది పండుగ సమయానికి బయటపడుతుంటుంది. కానీ ఈసారి వర్షాలు లేక నీటి నిల్వలు తగ్గిపోవడంతో, ఏకంగా ఆరు నెలల ముందే అంటే దసరా పండుగ నాటికే ఆలయం దాదాపు నీటి నుంచి బయట పడుతోంది. ఈ నేపథ్యంలో దసరా పర్వదినం నాడు స్వామివారికి తొలి పూజలు నిర్వహించేందుకు అర్చకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఆరు నెలల ముందే సంగమేశ్వరాలయం బయటపడటం భక్తులకు ఆధ్యాత్మికంగా ఆనందం కలిగించే విషయమే అయినా, వెనుక తీవ్రమైన ముప్పు పొంచి ఉందనే ఆందోళన మాత్రం భయపెడుతోంది. రానున్న రోజుల్లో సాగునీటికే కాక తాగే నీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటికే అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఆలయం ఇంత ముందుగా బయటకు రావడం రాబోయే తీవ్ర కరవు పరిస్థితులకు సంకేతమని స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com