☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్

బాలీవుడ్‌లో మళ్లీ హారర్ కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్‌కు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది పెద్దగా ఆకట్టుకోలేదు ఈ జోనర్ చిత్రాలు. కానీ భూత్ బంగ్లా సక్సెస్‌తో మళ్లీ హోప్ ఇచ్చాడు అక్షయ్ కుమార్. దీంతో ఈ తరహా సినిమాలపై ఆలియా భట్ నుండి అజయ్ దేవగన్ వరకు కాన్సట్రేట్‌ చేస్తున్నారు. కోర్టు రూమ్ డ్రామాలకు బ్రేక్ ఇచ్చిన యామీ గౌతమ్ కూడా ఈ సారి కామెడీ సినిమా చేసేందుకు సిద్ధమైంది. హారర్ కామెడీ నయీ నవేలితో […]
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్

బాలీవుడ్‌లో మళ్లీ హారర్ కామెడీ అండ్ థ్రిల్లర్ జోనర్‌కు డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది పెద్దగా ఆకట్టుకోలేదు ఈ జోనర్ చిత్రాలు. కానీ భూత్ బంగ్లా సక్సెస్‌తో మళ్లీ హోప్ ఇచ్చాడు అక్షయ్ కుమార్. దీంతో ఈ తరహా సినిమాలపై ఆలియా భట్ నుండి అజయ్ దేవగన్ వరకు కాన్సట్రేట్‌ చేస్తున్నారు. కోర్టు రూమ్ డ్రామాలకు బ్రేక్ ఇచ్చిన యామీ గౌతమ్ కూడా ఈ సారి కామెడీ సినిమా చేసేందుకు సిద్ధమైంది. హారర్ కామెడీ నయీ నవేలితో పలకరించబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఆలియా భట్ కూడా తొలిసారిగా ఈ జోనర్‌లోకి ఎంటరౌతోంది. 2018లో సంచలన విజయం సాధించిన తుంబడ్ సీక్వెల్లో భాగం కాబోతోంది. వచ్చే ఏడాది తుంబడ్‌2 రిలీజ్ కాబోతోంది.

హీరోయిన్స్ మాత్రమే కాదు… హీరోలు అజయ్ దేవగన్ అండ్ రాజ్ కుమార్ రావ్ కూడా హారర్ థ్రిల్లర్ స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అజయ్ గతంలో షైతాన్, భూత్ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాకు ‘సూర్య ప్రకాష్‌’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్. బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రాజ్ కుమార్ రావు కూడా ఓ హారర్ కామెడీ చేస్తున్నాడట. విషకన్య అనే హారర్ ఫాంటసీ ఫిల్మ్ తెరకెక్కిస్తోందట ధర్మ ప్రొడక్షన్స్. ‘లాపతా లేడీస్’ ఫేమ్ ప్రతిభా రత్న టైటిల్ రోల్ పోషించనుందట. ఈ రో చూస్తుంటే మళ్లీ హారర్ జోనర్‌పై కాన్సట్రేట్‌ చేస్తున్నట్లే ఉంది బాలీవుడ్.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్రTragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com