☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు

మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు Caption of Image. సూర్యాపేట/ఆమనగల్లు, వెలుగు : విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు 33 కేవీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించి, 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మునగాల సబ్ స్టేషన్ ముందు దున్నపోతుకు వినతి పత్రం అందిజేసి నిరసన తెలిపారు. మల్లయ్య యాదవ్​ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాలోని పాలేరుకు తరలిస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి సబ్ స్టేషన్ వద
మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు
మునగాల మండల కేంద్రంలో విద్యుత్ కోతలపై.. బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు

సూర్యాపేట/ఆమనగల్లు, వెలుగు : విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు 33 కేవీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించి, 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మునగాల సబ్ స్టేషన్ ముందు దున్నపోతుకు వినతి పత్రం అందిజేసి నిరసన తెలిపారు.

మల్లయ్య యాదవ్​ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా పక్క జిల్లాలోని పాలేరుకు తరలిస్తున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి సబ్ స్టేషన్ వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు పగిళ్ల సైదులు, పెద్ది కృపాకర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టి, సాగునీరు, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, లో వోల్టేజీ సమస్యతో మోటర్లు నడవక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వారు ఆరోపించారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← గచ్చిబౌలిలో ఐటీ అమ్మాయికి ముద్దు పెట్టి పారిపోయిన సెక్యూరిటీ గార్డ్భారత్-న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఇకపై డెడ్ చీప్ రేట్లకే కివీ ఫ్రూట్స్ దొరుకుతాయ్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com