☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Lucky Zodiac Signs: బుధ, శుక్రుల కలయిక..ఇక ఈ రాశులకు అదృష్టమే అదృష్టం..!

బుధ, శుక్రులు ఎక్కడ కలిసినా కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అందులోనూ బుధ, శుక్రులకు సంబంధించిన స్థానాల్లో ఈ రెండు శుభ గ్రహాలు కలిస్తే శుభ ఫలితాలకు కొదవే ఉండదు. ఈ నెల(సెప్టెంబర్) 26 నుంచి నవంబర్ 5 వరకూ శుక్రుడికి చెందిన తులా రాశిలో కలవబోతున్న ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టాలు పట్టబోతున్నాయి. ముఖ్యమైన విషయాల్లో శుభ వార్తలు వినడం, కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసు కోవడం తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరుతాయి.
Lucky Zodiac Signs: బుధ, శుక్రుల కలయిక..ఇక ఈ రాశులకు అదృష్టమే అదృష్టం..!
1 Mesha Rashi

మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర, బుధులు కలవడం వల్ల ప్రధానంగా ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది.. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగా ల్లోనే కాక సామాజికంగా కూడా ప్రాభవం పెరుగుతుంది.. సంపన్న వ్యక్తితో వివాహం కుదురు తుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు బాగా ఎక్కువగావింటారు.

3 Mithuna Rashi

మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో మిత్రగ్రహమైన శుక్రుడితో యుతి చెందడం వల్ల అనేక పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.

4 Karkataka Rashi

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, బుధుల కలయిక వల్ల ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవు తుంది. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆదా యం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభి స్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకో వడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి అవకాశం ఉంది.

6 Kanya Rashi

కన్య: రాశ్యధిపతి బుధుడు తన మిత్ర గ్రహమైన శుక్రుడితో ధన స్థానంలో యుతి చెందడం వల్ల ఉద్యో గపరంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందు తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

7 Tula Rashi

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, భాగ్య స్థానాధిపతి బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా ఉన్నత పదవులు లభిస్తాయి. రాజయోగాలతో పాటు రాజపూజ్యాలు, ధన యోగాలు కలు గుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమై, విదేశీ సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభి స్తుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఊహిం చని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

9 Dhanusu Rashi

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రుల కలయిక వల్ల ఈ రాశివారికి సామాజికంగానే కాక, రాజకీయంగా, ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదల ఉంటుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

10 Makara Rashi

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల కలయిక ఈ రాశివారికి ఎంతో శుభప్రదమైనది. ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి, డిమాండ్ పెరగడం వంటి వాటితో పాటు రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Astrology Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు షేర్ చేయొద్దట.. జ్యోతిష్యం వెనుక ఉన్న నమ్మకం ఇదే!ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? APPSCలో 196 ASO పోస్టులు! నెలకు లక్షన్నర జీతం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com