☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఏడా జాడ లేదు..బతుకుమ్మకు తంగేడు పువ్వు కరువు!

ప్రకృతి పూల పండుగ బతుకమ్మ. అడవిలో సహజంగా లభించే తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. బతుకమ్మ పండుగ రోజుల్లో ప్రతీ రోజు పేర్చే బతుకమ్మలో తంగేడు పువ్వు ప్రధానమైనది. రాష్ట్ర పుష్పంగానూ గుర్తింపు పొందిన తంగేడుకు కరువు వచ్చింది. దీంతో తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మకు కొత్త కష్టం వచ్చింది.
ఏడా జాడ లేదు..బతుకుమ్మకు తంగేడు పువ్వు కరువు!
Bathukamma 1

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ఓ సజీవ ప్రతీక. ఆడపడుచుల ఆటపాటలు.. రంగు రంగుల పూల పేర్పులు.. ప్రకృతితో మమేకమయ్యే వేడుకలు.. ఇవన్నీ కలిస్తేనే బతుకమ్మ పండుగకు సంపూర్ణత. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం కనిపించినా, బతుకమ్మ పేర్పులో తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పసుపు రంగులో మెరిసే ఈ పూలు బతుకమ్మకు అందాన్ని ఇవ్వడమే కాదు.. తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయి. రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందిన తంగేడు.. బతుకమ్మతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంది. మహిళలు బతుకమ్మను పేర్చేటప్పుడు తంగేడు పూలను ప్రధానంగా వినియోగిస్తారు. వాటితో పాటు గునుగు, గడ్డి, గానుగ, ఇతర కాలానుగుణ పూలను సేకరించి అందంగా పేర్చుతారు. ప్రకృతిలో సహజంగా లభించే పూలతో బతుకమ్మను తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత.

Bathukamma 2

ఒకప్పుడు ఉచితం.. ఇప్పుడు వెతికినా దొరకడం కష్టం.. ఒకప్పుడు పల్లె పొలిమేరల్లోకి వెళ్తే చాలు.. గుట్టలు, బీడు భూములు, రోడ్ల పక్కన ఎక్కడ చూసినా పసుపు వర్ణంతో కను విందు చేసే తంగేడు పూలు కనిపించేవి! బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలకు ప్రకృతి ఇచ్చే ఉచిత కానుకగా అవి మారేవి. మహిళలు, యువతులు, సోదరులు గుంపులుగా పొలిమేరల్లోకి వెళ్లేవారు. గుట్టలు, చెరువుల పరిసరాలు, బీడు భూముల్లో పూసే తంగేడు పూలను సేకరించేవారు. పోటీపడి మరీ పెద్ద బతుకమ్మలు పేర్చేవారు.

Bathukamma 3

బతుకమ్మ పూల పండుగ.. తంగేడు ప్రత్యేకత.. బతుకమ్మతో తంగేడు పూలకు విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉంది. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చే బతుకమ్మలో మొదట తంగేడునే చేరుస్తారు. వాటితో పాటు గునుగు, గడ్డి, గానుగ, ఇతర కాలానుగుణ పూలను సేకరించి అందంగా పేర్చుతారు. ప్రకృతిలో సహజంగా లభించే పూలతో బతుకమ్మను తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. మహిళలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూలు వినియోగించడం ఆనవాయితీ. ఈ పూలలో ఔషధ గుణాలు ఉంటాయని నమ్మకం.

Bathukamma 4

ఎల్‌నినో ప్రభావంతో బతుకమ్మకు కొత్త కష్టం..ఈ ఏడాది తంగేడు పూలకు తీవ్ర కరువొచ్చింది. దీంతో బతుకమ్మకు అవసరమయ్యే తంగేడు కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు కనిపించినా.. ఆశించిన స్థాయిలో పూలు లభించడం లేదు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు బతుకమ్మ పూల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌నినో ప్రభావం తంగేడు పూలపై పడింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకోవడంతో సహజంగా పెరిగే తంగేడు కనిపించడం లేదు.

Bathukamma 5

తంగేడు పూల కొరతతో మార్కెట్‌లో ధరల సెగ.. సహజంగా లభించే తంగేడు పూలు లభించకపోవడంతో మహిళలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తంగేడు పూలకు బదులు బంతి, చామంతి, గానుగ, గడ్డి పూలను వినియోగిస్తున్నారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం మార్కెట్ లో పూలకు డిమాండ్ పెరిగింది. ఏదేమైనా.. ఒకప్పుడు ఉచితంగా లభించిన పూల కోసం ఇప్పుడు డబ్బు వెచ్చించాల్సి రావడం పండుగ ఖర్చులను పెంచుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Bathukamma 6

రాష్ట్ర పుష్పం తంగేడును కాపాడుకోవాలి..తంగేడు కేవలం బతుకమ్మలో పేర్చే పువ్వు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రకృతి వైవిధ్యానికి గుర్తింపు. తంగేడు పువ్వు రాష్ట్ర పుష్పంగా గుర్తించబడింది. తంగేడు వనాలు తగ్గడం రియల్ ఎస్టేట్ పెరగడం, పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో తంగేడు పూలు తగ్గిపోతున్నాయి. సహజంగా పెరిగే ఈ మొక్కలను సంరక్షించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు వాటి ఉనికిని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్..అడవిలో దాగిన భారీ పాములు.. డ్రోన్లతో వేటకు దిగిన శాస్త్రవేత్తలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com