☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

బ్యాంకుల సమ్మె.. ఏటీఎం ఛార్జీలు రద్దు

Bank Strike : ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ...
బ్యాంకుల సమ్మె.. ఏటీఎం ఛార్జీలు రద్దు

Bank Strike : ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks) కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మె సమయంలో బ్యాంక్ శాఖల సేవలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో, ఖాతాదారులకు నగదు కొరత రాకుండా చూసేందుకు ఏటీఎంల వినియోగంపై ఉన్న పరిమితులను సడలించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చూపిన బాటలోనే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మూడు రోజుల పాటు ఏటీఎంలలో పరిమితికి మించిన లావాదేవీలపై వేసే రుసుములను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

Read Also : ముంబయిలో లాల్‌బాగ్‌చా రాజా శోభాయాత్ర

hyderabad is sadan atm cash van theft 17 lakhs

ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఉచిత నగదు ఉపసంహరణ

సాధారణంగా నిర్ణీత ఉచిత పరిమితి (Free Limits) దాటిన తర్వాత కస్టమర్లు చేసే ప్రతి ఏటీఎం లావాదేవీపై రూ. 10 నుంచి గరిష్ఠంగా రూ. 23 వరకు (జీఎస్టీ అదనం) ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సమ్మె కాలంలో వినియోగదారులు తమ స్వంత బ్యాంకు ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలను వినియోగించుకున్నప్పటికీ ఎటువంటి అదనపు ఛార్జీలు పడవు. బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లే ఈ మూడు రోజుల్లో ప్రజలు ఏ ఏటీఎం నుంచైనా ఎలాంటి ఆందోళన లేకుండా నగదు డ్రా చేసుకునే వెసులుబాటు లభించడంతో ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG
← కాంగోలో కుప్పకూలిన విమానం.. 14 మంది మృతివచ్చే నెల నుంచి కల్కి-2 షూటింగు స్టార్ట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com