☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Carney’s comments | అమెరికా దాడి చేస్తుంద‌నే అంచనాతో మేమూ సిద్ధ‌మ‌య్యాం.. కెనడా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Carney's comments | అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తుందేమోన‌ని తాము అంచనా వేశామ‌ని, అందుకు తాము కూడా ప్ర‌తిదాడికి సిద్ధ‌మ‌య్యాయ‌ని కెన‌డా ప్ర‌ధాని (Canada PM) మార్క్ కార్నీ (Mark Carney) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ పదేపదే అనుచిత‌ వ్యాఖ్యలు చేశాడ‌ని, దాంతో ఈ అంశంపై కెనడా ప్రభుత్వం (Canda Govt) ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
Carney’s comments | అమెరికా దాడి చేస్తుంద‌నే అంచనాతో మేమూ సిద్ధ‌మ‌య్యాం.. కెనడా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Carney’s comments : అమెరికా (USA) తమ దేశంపై దాడిచేస్తుందేమోన‌ని తాము అంచనా వేశామ‌ని, అందుకు తాము కూడా ప్ర‌తిదాడికి సిద్ధ‌మ‌య్యాయ‌ని కెన‌డా ప్ర‌ధాని (Canada PM) మార్క్ కార్నీ (Mark Carney) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ పదేపదే అనుచిత‌ వ్యాఖ్యలు చేశాడ‌ని, దాంతో ఈ అంశంపై కెనడా ప్రభుత్వం (Canda Govt) ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

అయితే అమెరికా దాడిచేసే అవకాశం ఉందని తామిప్పుడు భావించడం లేదని కార్నీ స్పష్టంచేశారు. అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితులను కూడా పరిశీలించడం ప్రధానిగా త‌న‌ బాధ్యతని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను పట్టించుకోకుండా నిర్ల‌క్ష్యంగా ఉండటం బాధ్యతారాహిత్యమే అవుతుందని ఓ జాతీయ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న‌ పేర్కొన్నారు. కాగా అమెరికా, కెనడా మధ్య గత ఏడాది నుంచి వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం భారీ సుంకాలు విధించింది.

దీనికి ప్రతిగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది. అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడటంవల్ల కెనడాకు ఇబ్బందులు వస్తున్నాయని కార్నీ చెబుతున్నారు. అందుకే అమెరికా వెలుపల కొత్త వాణిజ్య భాగస్వాములను వెతుకుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌తో కెనడా సన్నిహిత సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈయూలో కెనడా అసోసియేట్‌ సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారంపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు.

అలా జరిగితే అది శత్రుత్వ చర్యగా భావించి యూరప్‌పై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. మ‌రోవైపు కెనడా అమెరికాలో కలిసిపోవాలన్న ప్రతిపాదనను కార్నీ తిరస్కరించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను వివిధ దేశాలతో అనుసంధానం చేయడమే లక్ష్యమని స్పష్టంచేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | ది ప్యారడైజ్ నుంచి 7 నిమిషాల సీన్లు కట్.. అసలు విషయం బయటపెట్టిన నటుడుSampoornesh Babu | నటుడు సంపూర్ణేష్ బాబుకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com