☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పెద్దపల్లి బీఆర్ఎస్ బీసీ సెల్ సభలో రసాభాస

పెద్దపల్లి బీఆర్ఎస్ బీసీ సెల్ సభలో రసాభాస Caption of Image. నిరసనకారులపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనుచరుల దాడి కరీంనగర్ (పెద్దపల్లి), వెలుగు: పెద్దపల్లిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్​ నియోజకవర్గ స్థాయి బీసీ సెల్​ముఖ్య నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఈ మీటింగ్​కు ఆ పార్టీ బీసీ నేతలు మాజీ జడ్పీటీసీ గంట రాములు, దాసరి ఉష, చిరుమల్ల రాకేశ్​ను ఆహ్వానించలేదు. దీంతో వారి అనుచరులు గోపరపల్లి సర్పంచ్​ రవి యాదవ్, హరిపురం మాజీ ఉపసర్పంచ్​ నాగరాజు యాదవ్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డిని నిలదీయగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మనోహర్​రెడ్డి అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో హరిపురం సర్పంచ్ విజయ నాగరాజుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కారు, కుర్చీలు ధ్వంసం అయ్
పెద్దపల్లి బీఆర్ఎస్ బీసీ సెల్ సభలో రసాభాస
పెద్దపల్లి బీఆర్ఎస్ బీసీ సెల్ సభలో రసాభాస
  • నిరసనకారులపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనుచరుల దాడి

కరీంనగర్ (పెద్దపల్లి), వెలుగు: పెద్దపల్లిలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్​ నియోజకవర్గ స్థాయి బీసీ సెల్​ముఖ్య నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఈ మీటింగ్​కు ఆ పార్టీ బీసీ నేతలు మాజీ జడ్పీటీసీ గంట రాములు, దాసరి ఉష, చిరుమల్ల రాకేశ్​ను ఆహ్వానించలేదు. దీంతో వారి అనుచరులు గోపరపల్లి సర్పంచ్​ రవి యాదవ్, హరిపురం మాజీ ఉపసర్పంచ్​ నాగరాజు యాదవ్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డిని నిలదీయగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో మనోహర్​రెడ్డి అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో హరిపురం సర్పంచ్ విజయ నాగరాజుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కారు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, దాసోజు శ్రవణ్, పల్లె రవికుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← బాలల మనస్తత్వశాస్త్రం: పిల్లలకు స్వేచ్ఛకన్నా స్పష్టతే ముఖ్యం.. ప్రేమతో పెట్టిన హద్దులే బలంఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com