☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

విజయానికి చివరి ఓవర్లో 4 పరుగులు.. తొలి 3 బంతుల్లో 3 పరుగులు.. ఆతర్వాత ఊహించని ట్విస్ట్..!

Chennai Test 1986: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే మ్యాచ్‌ టైగా ముగిసింది. అందులో ఒకటి సరిగ్గా నలభై ఏళ్ల క్రితం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక పోరు. ఐదు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ అద్భుతమైన మ్యాచ్ క్రీడా ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది.
విజయానికి చివరి ఓవర్లో 4 పరుగులు.. తొలి 3 బంతుల్లో 3 పరుగులు.. ఆతర్వాత ఊహించని ట్విస్ట్..!

Chennai Test 1986: అంతర్జాతీయ టెస్టుల చరిత్ర ప్రారంభమైన నాటి నుంచి వేల మ్యాచ్‌లు జరిగాయి. అయితే రెండు జట్లు సమానమైన పరుగులు సాధించి ఫలితం తేలకుండా ముగిసిన సందర్భాలు అత్యంత అరుదు. వెస్టిండీస్ (West Indies), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరిగిన పోరు మొదటిది కాగా, భారత్ (India), ఆస్ట్రేలియా జట్ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium) లో జరిగిన మ్యాచ్ రెండవది. ఈ చారిత్రాత్మక టెస్టుకు సెప్టెంబర్ 22వ తేదీతో 40 ఏళ్లు పూర్తయ్యాయి. అలన్ బోర్డర్ (Allan Border) సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డీన్ జోన్స్ (Dean Jones) అద్భుతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఉక్కపోత వాతావరణంలో 8 గంటలకు పైగా క్రీజులో నిలదొక్కుకున్న జోన్స్ వాంతులు అయినప్పటికీ పట్టుదల వదలలేదు. డేవిడ్ బూన్ (David Boon) శతకం సాధించగా, కెప్టెన్ బోర్డర్ కూడా సెంచరీ బాదాడు. దీంతో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హైదరాబాద్‌కు చెందిన శివలాల్ యాదవ్ (Shivlal Yadav) 4 వికెట్లు పడగొట్టాడు.

ఎక్కువమంది చదివనది: Team India: నాడు కిట్ కొనడానికి డబ్బుల్లేవు.. ఒక్కపూట భోజనంతో ప్రాక్టీస్.. నేడు కోట్ల సంపదకు ఓనర్..!

దీటుగా బదులిచ్చిన భారత జట్టు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) దూకుడైన ఆటతీరుతో శతకం బాది జట్టును ఆదుకున్నాడు. శ్రీకాంత్ (Srikkanth), మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) అర్ధ శతకాలతో రాణించారు. భారత్ 397 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా తరపున గ్రెగ్ మాథ్యూస్ (Greg Matthews) 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 170 పరుగులు చేసి డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 348 పరుగుల లక్షం నిలిచింది.

ఎక్కువమంది చదివనది: 5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర!

ఆఖరి రోజు లక్ష్య సాధనలో సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో బలమైన ఫౌండేషన్ వేశాడు. మొహిందర్ అమర్‌నాథ్ (Mohinder Amarnath), అజారుద్దీన్ బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు నడిపించారు. మ్యాచ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో రవిశాస్త్రి (Ravi Shastri), చేతన్ శర్మ (Chetan Sharma) క్రీజులో ఉన్నారు. విజయానికి అతి సమీపంలో నిలిచిన భారత్ సడన్‌గా కుప్పకూలింది. రే బ్రైట్ (Ray Bright) వరుస వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో గెలవడానికి 4 పరుగులు అవసరమవ్వగా, తొలి మూడు బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. స్కోర్లు సమం అయిన తరుణంలో చివరికి గ్రెగ్ మాథ్యూస్ బౌలింగ్‌లో మనిందర్ సింగ్ (Maninder Singh) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగడంతో భారత్ ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← భారత్‌లో రాష్ట్రాలన్నీ ఎందుకు ఇంత భిన్నంగా ఉన్నాయి?గ్యాస్ సమస్య పదేపదే వస్తుందా? ఈ అలవాట్లు పాటిస్తే ఉపశమనం పొందొచ్చు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com