☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సినిమాలో సీఎంగా కనిపించబోతున్న మాజీ సీఎం

Ex CM Siddaramaiah : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ దిగ్గజం సిద్ధరామయ్య రంగుల ప్రపంచంలోకి రీ-ఎంట్రీ ఇస్తూ మరోసారి సీఎం పాత్రలో కనిపించబోతున్నారు. అయితే...
సినిమాలో సీఎంగా కనిపించబోతున్న మాజీ సీఎం

Ex CM Siddaramaiah : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ దిగ్గజం సిద్ధరామయ్య రంగుల ప్రపంచంలోకి రీ-ఎంట్రీ ఇస్తూ మరోసారి సీఎం పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇది నిజ జీవితంలో కాకుండా ‘ముఖ్యమంత్రి’ అనే కన్నడ ఫీచర్ సినిమాలో టైటిల్ రోల్ పోషించనున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయనను పూర్తి స్థాయి పాత్రలో వెండితెరపై చూపించేందుకు దర్శక నిర్మాత రాజేష్ గౌడ ‘ఆర్‌ఏ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు కూడా అతిథి పాత్రల్లో మెరవనున్నారని సమాచారం.

Read Also : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

48 గంటల్లో స్క్రిప్ట్ టు స్క్రీన్: గిన్నిస్ రికార్డే లక్ష్యం

ఈ సినిమా కేవలం సిద్ధరామయ్య నటనకే కాకుండా ఒక వినూత్నమైన ప్రయోగానికి వేదిక కానుంది. కథా చర్చలు, చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి కేవలం 48 గంటల్లో థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలని దర్శకుడు రాజేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కళాశాల రోజుల్లో నాటకాలలో నటించిన అనుభవం ఉన్న సిద్ధరామయ్య, 2017లో ‘సమ్మర్ హాలిడేస్’ అనే బాలల చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ 48 గంటల రికార్డు ప్రాజెక్ట్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా అలరిస్తారోనని ఇటు రాజకీయాల్లోనూ, అటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు రజత పతకం.. 44 ఏళ్ల నిరీక్షణకు తెరతెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టుల ఏర్పాటుకు ఆమోదం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com