☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!

కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఘనంగా అందుకున్నారు. కేరళ కాంగ్రెస్ దిగ్గజ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ‘ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఫౌండేషన్ ప్రతినిధులు , ఏఐసీసీ ముఖ్య నేతలు సస్కారపూర్వకంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదు బహుమతి, […]
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!

కేరళలోని నిలంబూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఘనంగా అందుకున్నారు. కేరళ కాంగ్రెస్ దిగ్గజ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ‘ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఫౌండేషన్ ప్రతినిధులు , ఏఐసీసీ ముఖ్య నేతలు సస్కారపూర్వకంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం , జ్ఞాపికను ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రజా సంక్షేమ పాలనకు దక్కిన గౌరవం

తెలంగాణ రాష్ట్రంలో రైతులు, వెనుకబడిన వర్గాలు (బీసీలు) , సామాన్య ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు, ఆయన కనబరుస్తున్న దూరదృష్టి గల పరిపాలనా వైఖరికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. ప్రజాస్వామిక విలువల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను, సమర్థవంతమైన నాయకత్వాన్ని అవార్డు ఎంపిక జ్యూరీ సభ్యులైన ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్ , ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ ప్రత్యేకంగా కొనియాడారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ కీలక నేతలు

దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రదానోత్సవ వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై స్మారక ఉపన్యాసం చేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా సేవలు అందించి కేరళ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆర్యదాన్ ముహమ్మద్ పేరిట నెలకొల్పిన తొలి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి స్వీకరించడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు అభినందనలు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com