☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!

Chiranjeevi’s Kaaka Movie Latest Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాకా డబ్బింగ్ […]
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!

Chiranjeevi’s Kaaka Movie Latest Update: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం కాకా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కాకా డబ్బింగ్ వర్క్ మొదలైన విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ‘కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి డబ్బింగ్ పనులు షురూ అయ్యాయి. కాకా జనవరి 13 2027న సంక్రాంతి కానుకగా రాబోతోంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీంతో కాకా సంక్రాంతి విడుదలపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. గతంలో ఈ సినిమాను వాయిదా వేసి.. అదే సమయంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డబ్బింగ్ పనులు ప్రారంభించినట్లు ప్రకటించడంతో కాకా విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గడం లేదనే విషయం స్పష్టమైంది.

ఇక చిరంజీవి, బాబీ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత మరోసారి కలిసి పనిచేస్తుండటంతో కాకాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు.. నంది అవార్డులపై కీలక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com