☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు.. నంది అవార్డులపై కీలక ప్రకటన

ఈ సందర్భంగా మాట్లాడిన భరత్ భూషణ్ ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల ఫంక్షన్ తిరుపతిలో నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వస్తారని ఆయన పేర్కొన్నారు.
తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు.. నంది అవార్డులపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ సినీ, టీవీ, నాటక రంగాల నంది అవార్డులకు సంబంధించి ఇటీవల ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ నుంచి ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ , ఎఫ్డీసీ సభ్యులు బుర్ర సాయి మాధవ్ , మీర్ , టీవీ & ఓటీటీ సౌత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని , తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ , టీవీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ వ్యక్తులతో చర్చలు జరిపారు. ఈ చర్చలలో భరత్ భూషణ్ గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. 2017 నుంచి 2024 వరకు ఉన్న అవార్డులను ఏ విధంగా ఇస్తారనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని, 2025 సంవత్సరం నుంచి నంది అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఈ అవార్డుల ఫంక్షన్ తిరుపతిలో ఒక్క రోజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అవార్డుల ఫంక్షన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. అలాగే టీవీ రంగానికి సంబంధించిన పలు ప్రోగ్రాములు లేదా షూటింగులు ఆంధ్రప్రదేశ్ లో జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. కేవలం కొంతవరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయడం కాకుండా వీలైనంత వరకు అధికంగా అక్కడ షూటింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన టీవీ రంగం వారిని కోరారు.

ఈ సందర్భంగా టీవీ రంగం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ టీవీ రంగానికి సంబంధించిన షూటింగులు ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా చేస్తామని కానీ వారికి అక్కడ ప్రభుత్వం పూర్తి సహకారం అందేలా చూడాలని వారు ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి విన్నవించారు.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో తమకంటూ స్టూడియోస్ కోసం స్థలాన్ని, అలాగే జిల్లా లో స్థలాలను కేటాయించాలని కోరారు. షూటింగ్ లో పర భాష వ్యక్తులను కూడా మితం చేస్తే ఇక్కడ ఆర్టిస్టులకు ఎటువంటి ఇబ్బంది కలగదని అదేవిధంగా టీవీ తో పాటు టీవీ మీడియా రంగంలో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఆర్టిస్టుల ఆరోగ్యo కోసం ఇన్సూరెన్స్ లు, వీలైతే పెన్షన్లు కోరారు. షూటింగ్ జరుగు సమయంలో సబ్సిడీలు ఇచ్చేలా చూడాలని, నిర్మాతలకు భారం లేకుండా తక్కువ ఖర్చులో షూటింగు పూర్తి చేసేందుకు సహాయంగా నిలవాలని కోరుకున్నారు. వారి కోరికలకు సానుకూలంగా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గారు స్పందిస్తూ దీనికి సంబంధించిన చర్చలు అన్నీ త్వరలో జరిపి తగిన నిర్ణయాలు తీసుకుంటామని, చిత్ర పరిశ్రమకు, టీవీ వారికి, నాటక రంగం వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. ఇవి వెంటనే నిర్ణయం తీసుకునే అంశాలు కాదని, త్వరలోనే వీటికి సంబంధించి కమిటీలు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

Apfdc Chairman Bharat Bhush

APFDC Chairman Bharat Bhushan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com