☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్

విమానం రన్‌వేపై దిగుతోంది..అంతలోనే ఊహించని ఘటన.. ల్యాండింగ్ సమయంలో విమానం కుడి టైర్ ఊడిపోయింది. టైర్ దూరంగా పడటంతో ఆ కుదుపుకు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానంలోని 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నేపాల్‌లోని జుఫాల్ విమానాశ్రయంలో గురువారం చోటుచేసుకుంది.
ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్

సీతా ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం నేపాల్‌గంజ్ నుంచి డోల్పాకు బయలుదేరింది. విమానంలో 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. జుఫాల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కుడివైపు టైర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో విమానం పెద్ద కుదుపుతో రన్‌వేపైనే ఆగిపోయింది.

పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

విమానం టైర్ ఊడిపోయిన వెంటనే పైలట్ ఇంజిన్‌ను వెంటనే ఆపేశారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా నియంత్రించగలిగారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు .విమానానికి కూడా పెద్దగా నిర్మాణపరమైన నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. టైర్ ఊడి విమానం అదుపు తప్పి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండేది. అయితే పైలట్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Sita Airplane Loses Wheel During Landing At Juphal Airport

Sita Airplane Loses Wheel During Landing At Juphal Airport

విమానం రన్‌వేపైనే.. విమాన రాకపోకలు నిలిపివేత

అయితే ప్రమాదం తప్పినా మరో సమస్య మొదలైంది. విమానం రన్‌వే పైనే నిలిచిపోవడంతో జుఫాల్ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి వస్తున్న నేపాల్ ఆర్మీకి చెందిన ఓ విమానం అత్యవసర పరిస్థితి కారణంగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. రన్‌వేపై ఉన్న విమానాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమానాన్ని రిపేర్ చేసేందుకు అవసరమైన సాంకేతిక నిపుణులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. విమానం తొలగించిన తర్వాత రన్‌వే పై మరమ్మత్తు పనులు పూర్తి చేసి విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ల్యాండింగ్ సమయంలో టైర్ ఊడిపోయి ఒక్కసారిగా ఉత్కంఠ రేపిన ఈ ఘటనలో పైలట్ అప్రమత్తతతో 16 మంది సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్‌తో ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు.. నంది అవార్డులపై కీలక ప్రకటనSajja Boorelu: రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు.. నూనె పీల్చకుండా అదిరిపోయే రుచి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com