☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Sajja Boorelu: రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు.. నూనె పీల్చకుండా అదిరిపోయే రుచి

మన ప్రాచీన సంప్రదాయ వంటకాలలో చిరుధాన్యాలతో చేసే పిండివంటలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోనూ శరీరానికి అధిక బలాన్ని, రక్తాన్ని వృద్ధి చేసే సజ్జలు మహిళల ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటివి. సజ్జలలో ఉండే పుష్కలమైన ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది; కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. సజ్జలతో ఎప్పుడూ రొట్టెలే కాకుండా, బెల్లం తీపితో పాతకాలం నాటి పద్ధతిలో చేసే 'సజ్జప్పాలు' లేదా సజ్జ బూరెలు ఎంతో రుచిగా ఉంటాయి.
Sajja Boorelu: రక్తహీనత పోగొట్టి ఎముకల బలం పెంచే సంప్రదాయ సజ్జ బూరెలు.. నూనె పీల్చకుండా అదిరిపోయే రుచి
Sajja Boorelu (1)

కావలసిన పదార్థాలు: 1 కప్పు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టిన సజ్జలు, అర కప్పు బెల్లం తురుము, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము, 2 స్పూన్ల గసగసాలు, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, పావు టీస్పూన్ యాలకుల పొడి తీపిని బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు ఉప్పు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కేవలం బెల్లం కరిగించడానికి మాత్రమే, డీప్ ఫ్రైకి సరిపడా నూనె

Sajja Boorelu (2)

తయారీ విధానం: ఒక కప్పు సజ్జలను నీటిలో బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం మరోసారి కడిగి, జల్లెడలో వేసి నీటిని పూర్తిగా వడకట్టాలి. ఆ తర్వాత ఒక పొడి కాటన్ బట్టపై పరిచి గాలికి అరగంట పాటు ఆరబెట్టాలి ఎండలో పెట్టకూడదు. కాస్త తడి ఆరిన సజ్జలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడ పట్టి బరకగా ఉన్న పొట్టును తీసేసి, నునుపైన తడి సజ్జపిండిని ఒక వెడల్పాటి తాంబూలంలో పక్కన పెట్టుకోవాలి.

Sajja Boorelu (3)

చిన్న పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి 2 స్పూన్ల గసగసాలు, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేలా 2-3 నిమిషాలు వేయించి పక్కన ఉంచాలి. వేరొక గిన్నెలో అర కప్పు బెల్లం, చిటికెడు ఉప్పు, కేవలం 1-2 స్పూన్ల నీళ్లు పోసి కరిగించాలి పాకం అవసరం లేదు, బెల్లం కరిగి ఒక్క పొంగు వస్తే చాలు.

Sajja Boorelu (4)

జల్లించిన సజ్జపిండిలో యాలకుల పొడి, వేయించిన గసగసాలు-కొబ్బరి మిశ్రమం వేసి చేత్తో బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన వేడి బెల్లం నీళ్లను కొద్దికొద్దిగా జల్లెడతో వడకడుతూ పిండిలో పోయాలి. మొదట స్పూన్‌తో, ఆ తర్వాత చేత్తో కలుపుకోవాలి. పిండి జారైపోకుండా చూసుకోవాలి పొరపాటున జారైతే ఒక స్పూన్ పొడి సజ్జపిండి లేదా బియ్యప్పిండి కలుపుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా మృదువైన ముద్దలా కలుపుకుని మూతపెట్టాలి.

Sajja Boorelu (5)

చేతికి నూనె రాసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని.. పాల ప్యాకెట్ కవర్ లేదా అరిటాకుపై పెట్టి పగుళ్లు లేకుండా మీడియం మందంలో గుండ్రంగా అప్పంలా ఒత్తుకోవాలి. బాండీలో నూనెను మీడియం హీట్ చేయాలి. అప్పాన్ని నూనెలో వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. వేసిన 10-15 సెకన్లలోనే పూరీలా చక్కగా పొంగి పైకి తేలుతుంది. వెంటనే రెండో వైపు తిప్పి, నురగలు తగ్గి మంచి రంగు రాగానే జాలి గరిటెతో తీసుకోవాలి. అంతే, నోరూరించే బలవర్ధకమైన సజ్జప్పాలు సిద్ధం! పైన క్రిస్పీగా, లోపల కొబ్బరి-గసగసాల కమ్మదనంతో గుల్లగా ఉండే ఈ స్వీట్ తింటే ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది.

⬇ Full News JPG⬇ Short News JPG
← ల్యాండ్‌ అవుతుండగా ఊడిన విమానం టైర్.. రన్‌వే పై భీకర టెన్షన్Star Fruit Benefits: నక్షత్రంలా ఉండే ఈ పండు తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com