☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కోల్ కతాలో సీఎం విజయ్ పార్టీ ఆఫీస్ : పాన్ ఇండియా పార్టీగా మారుస్తున్నారా ఏంటీ..?

కోల్ కతాలో సీఎం విజయ్ పార్టీ ఆఫీస్ : పాన్ ఇండియా పార్టీగా మారుస్తున్నారా ఏంటీ..?
కోల్ కతాలో సీఎం విజయ్ పార్టీ ఆఫీస్ : పాన్ ఇండియా పార్టీగా మారుస్తున్నారా ఏంటీ..?
కోల్ కతాలో సీఎం విజయ్ పార్టీ ఆఫీస్ : పాన్ ఇండియా పార్టీగా మారుస్తున్నారా ఏంటీ..?

తమిళనాడు సీఎం తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్‌కు సంబంధించిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్ జిల్లా ఫాగుపూర్‌లో TVK పేరుతో ఓ పార్టీ కార్యాలయాన్ని కొందరు మద్దతుదారులు ప్రారంభించారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ కార్యక్రమంలో... పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి విజయ్ అభిమానులు, TVK మద్దతుదారులు పాల్గొన్నట్లు అక్కడి లోకల్ మీడియా తెలిపింది.

అక్కడ తమను TVK సభ్యులుగా చెప్పుకున్న కొందరు... తమిళనాడు నుంచి వచ్చిన సూచనలతోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు... బెంగాల్‌లో ప్రస్తుతం దాదాపు ఐదు వేల మంది TVK మద్దతుదారులు ఉన్నారని అక్కడి ప్రతినిధి చైతాలి రాయ్ తెలిపారు. మొదట సోషల్ మీడియా ద్వారా పార్టీ గురించి ప్రచారం చేయడం... ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం తమ లక్ష్యమని ఆమె చెప్పారు.ప్రత్యేకంగా విద్య, ఉద్యోగాల అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బెంగాల్‌లో కూడా TVK ఎన్నికల్లో పోటీ చేయాలని తమకు ఉందని... అయితే దీనిపై తుది నిర్ణయం పార్టీ అగ్ర నాయకత్వం తీసుకుంటుందని చైతాలి రాయ్ చెప్పారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంపై TVK కేంద్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చింది.పశ్చిమ బెంగాల్‌లో పార్టీ అధికారికంగా ఎలాంటి కార్యాలయాన్ని లేదా సంస్థాగత విభాగాన్ని ఏర్పాటు చేయలేదని TVK ప్రతినిధి సంకవి డయాన్నా తుహిన్సామ్యూయేల్ స్పష్టం చేశారు.బెంగాల్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయానికి పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతి, మద్దతు లేదా సంబంధం లేదని తెలిపారు.అది స్థానిక మద్దతుదారులు... విజయ్ నాయకత్వం, TVK రాజకీయాల నుంచి స్ఫూర్తి పొంది స్వతంత్రంగా చేపట్టిన కార్యక్రమం మాత్రమేనని పార్టీ వివరణ ఇచ్చింది.

మరో కీలక విషయం ఏమిటంటే... ప్రస్తుతానికి తమిళనాడు వెలుపల పార్టీ సంస్థాగత విస్తరణకు TVK ఎలాంటి అధికారిక ప్రణాళిక ప్రకటించలేదని పార్టీ స్పష్టం చేసింది.ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ పాలన, ఎన్నికల మేనిఫెస్టో అమలు, ప్రజా కార్యక్రమాలపైనే దృష్టి పెట్టినట్లు TVK తెలిపింది.అయితే బెంగాల్‌తో పాటు కేరళలో కూడా విజయ్ అభిమానులు, మద్దతుదారులు TVK పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Rain Alert: రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ కీలక సూచనలు!ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా తగ్గిన పంటల సాగు..ఆహార ద్రవ్యోల్బణం తప్పదా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com