☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని భూ అక్రమాలపై విచారణకు కమిటీ

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని భూ అక్రమాలపై విచారణకు కమిటీ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని భూ అక్రమాలపై విచారణకు కమిటీ
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని భూ అక్రమాలపై విచారణకు కమిటీ

హైదరాబాద్: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూ అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు రేవంత్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 134 జారీ చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనను కమిటీ చైర్ పర్సన్‎గా నియమించింది. కమిటీ కన్వీనర్‎గా రాజీవ్ గాంధీ హనుమంతు (స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ), జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లను కమిటీ సభ్యులుగా నియమించింది.

22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా వివిధ జిల్లాల్లో భూ అక్రమాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో భూముల అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో భూ అక్రమాలు, అవకతవకలపై ఈ కమిటీ విచారణ చేయనుంది. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మాడ్యూల్ దుర్వినియోగం, భూ రికార్డులపై కూడా కమిటీ విచారణ జరపనుంది.

కేసీఆర్, మాజీ మంత్రుల భూములపై విచారణ

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములపైన కమిటీ విచారణ చేయనుంది. ఎర్రవల్లి, సిరివెంకటాపూర్‌లో కేసీఆర్ కుటుంబం, అనుచరుల భూములపై కమిటీ ఆరా తీయనుంది. రంగనాయకసాగర్ సమీపంలోని హరీశ్‌రావు కుటుంబ భూములపైనా ఎంక్వైరీ చేయనుంది.

జన్వాడలో కేటీఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు కొనుగోలు చేసిన భూములపై విచారించనుంది. జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూములపై కూడా విచారణ జరపనుంది. అసైన్డ్, ప్రభుత్వ, భూదాన్, ఇనాం, అటవీ భూములపై కమిటీ సమగ్ర విచారణ చేపట్టనుంది. మల్లన్నసాగర్ భూసేకరణలో అవకతవకల ఆరోపణలపైనా కమిటీ ఆరా తీయనుంది.

విచారణలో అవకతవకలు తేలితే బాధ్యులపై చర్యలకు కమిటీ సిఫార్సు చేయనుంది. అవసరమైన రికార్డులు, డాక్యుమెంట్లు కోరే అధికారం కమిటీకి ప్రభుత్వం కల్పించింది. కాగా, రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన 22ఏ భూముల అంశంపై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise Box Office: మిక్స్‌డ్ టాక్‌తో ‘ది పారడైజ్’.. నాని హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? తింటే రోజుకి ఎన్ని తినాలో తెలుసా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com