☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి : పాలడుగు ప్రభావతి

ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, అలాగే వ్యవసాయానికి రోజుకు కనీసం 14 గంటల నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని సీపీఎం న‌ల్ల‌గొండ‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం...
ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి : పాలడుగు ప్రభావతి

– వ్యవసాయానికి రోజుకు 14 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాల‌ని డిమాండ్‌
– కనగల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా

క‌న‌గ‌ల్‌, సెప్టెంబ‌ర్ 25 : ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, అలాగే వ్యవసాయానికి రోజుకు కనీసం 14 గంటల నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని సీపీఎం న‌ల్ల‌గొండ‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం కనగల్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్నప్పటికీ, సాగునీరు అందక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామాల వారీగా పంట నష్టాన్ని సర్వే చేసి, ఎకరాకు తగిన నష్టపరిహారం అందించాలన్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందించకుండా క్రాప్ హాలిడే ప్రకటించడం రైతుల సమస్యకు పరిష్కారం కాదన్నారు. రైతులు పంటలు సాగు చేసుకునే విధంగా సాగునీరు, విద్యుత్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.

రైతుల డిమాండ్లు

– ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
– వ్యవసాయానికి రోజుకు కనీసం 14 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
– విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించి నిరంతరాయంగా సరఫరా చేయాలి
– పంట నష్టంపై గ్రామాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలి
– సాగునీటి వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి పంటలకు నీరు అందించాలి
– విద్యుత్ కోతల వల్ల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్న రైతులకు వెంటనే పరిహారం అందించాలి
– రైతుల పంట రుణాలను ఈ సంవత్సరం ఆపి, రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలి
– రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు సకాలంలో అందించాలి
– క్రాప్ హాలిడే ప్రకటించే బదులు రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన నీరు, విద్యుత్ అందించాలి
– వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైతు సహాయ ప్యాకేజీ ప్రకటించాలి.

రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రైతులతో కలిసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ముత్యాలు, సుల్తానా పెద్దలు గోపాల్ రాములు యాదమ్మ లక్ష్మి పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమిన‌ల్ ద‌ర్యాప్తు చేప‌ట్టండి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లుYanamala Krishnudu: వైసీపీ పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా.. తుని రాజకీయంలో సంచలనం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com