☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమిన‌ల్ ద‌ర్యాప్తు చేప‌ట్టండి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లు

CEC Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైంది. సీఈసీపై క్రిమిన‌ల్ ప్రాసిక్యూష‌న్ చేప‌ట్టాల‌ని ఆ పిల్‌లో డిమాండ్ చేశారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పేరుతో అక్ర‌మ రీతిలో ఓట్ల‌ను డిలీట్ చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అడ్వ‌కేట్ శైలేంద్ర మ‌ని త్రిపాఠి ఆ పిల్ వేశారు.
CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమిన‌ల్ ద‌ర్యాప్తు చేప‌ట్టండి.. సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లు

న్యూఢిల్లీ : చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌(CEC Gyanesh Kumar)పై సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లైంది. సీఈసీ జ్ఞానేశ్‌పై క్రిమిన‌ల్ ప్రాసిక్యూష‌న్ చేప‌ట్టాల‌ని ఆ పిల్‌లో డిమాండ్ చేశారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పేరుతో అక్ర‌మ రీతిలో ఓట్ల‌ను డిలీట్ చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. సీఈసీ జ్ఞానేశ్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న బాధ్య‌త‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు పిల్‌లో ఆరోపించారు. ఓట‌ర్ల రివిజ‌న్ ప్ర‌క్రియ కోసం అనేక నిర్ణ‌యాల‌ను త‌మ ఆమోదం లేకుండానే తీసుకున్న‌ట్లు ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్లు ఆరోపించిన విష‌యం తెలిసిందే. అయితే సీఈసీ జ్ఞానేశ్‌పై క్రిమిన‌ల్ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని అడ్వ‌కేట్ శైలేంద్ర మ‌ని త్రిపాఠి పిల్ వేశారు.

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 32 ప్ర‌కారం ఆయ‌న ఆ పిల్ దాఖ‌లు చేశారు. సీఈసీ తీసుకున్న నిర్ణ‌యాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, సూచ‌న‌లు, సాఫ్ట్‌వేర్ మార్పుల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని ఆ పిల్‌లో కోరారు. ఎన్నిక‌ల సంఘంలోని ఇత‌రు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ల ఆమోదం లేకుండా కుమార్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కొట్టివేయాల‌ని పిల్‌లో డిమాండ్ చేశారు. స‌ర్ ప్ర‌క్రియ‌తో సంబంధం ఉన్న అంశాల్లో 14 సార్లు సీఈసీ జ్ఞానేశ్‌ను వ్య‌తిరేకించిన‌ట్లు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఆరోపించారు.

1950 నాటి ప్ర‌తినిధుల చ‌ట్టంలోని సెక్ష‌న్ 32 ప్ర‌కారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాల‌ని అడ్వ‌కేట్ త్రిపాఠి త‌న పిల్‌లో సుప్రీంకోర్టును డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Scheme | ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ స్కీమ్‌ను ప్రారంభించిన ఢిల్లీ యూనివర్సిటీ.. అక్టోబర్‌ 13 చివరితేదీఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి : పాలడుగు ప్రభావతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com