☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Plane Crash | కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి

Plane Crash | డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి చెందారు. రువాండా మద్దతు ఉన్న ఎం23తోపాటు పలు తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.
Plane Crash | కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి

Plane Crash | డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. క్వాంగో ప్రావిన్స్‌లోని కెంజ్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది.

మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బకుమి లికులియా ఉన్నారని సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఎఫోమి ఎకెంగే తెలిపారు. వారిద్దరితో పాటు మరో 12 మంది సైనిక ప్రతినిధులు, సిబ్బంది కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

సాంకేతిక సమస్యా? మరేదైనా కారణమా?

విమానం నైరుతి కాంగోలోని కిక్విట్‌ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కెంజ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. విమానం కుప్పకూలిన ప్రదేశంలో పలువురు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభించాయి. నేలపై ఉన్న స్థానికుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, అసలు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కాంగో సైన్యం ప్రకటించింది.


కాంగోలో చాలాకాలంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తూర్పు కాంగోలోని పలు తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతోంది. రువాండా మద్దతు ఉన్న ఎం23తోపాటు పలు తిరుగుబాటు గ్రూపులతో కాంగో సైన్యం పోరాడుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఈ విమాన ప్రమాదంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో డబుల్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. కెప్టెన్‌గా ముకేశ్, అమన్ -సృష్టికి భారీ షాక్!Sampoornesh babu | ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ వివాదం.. జర్నలిస్ట్‌కు సంపూర్ణేష్ బాబు మద్దతు, నాగేంద్ర కుమార్ క్షమాపణలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com